Heart Attack : మీ కళ్లేదుటే ఎవరైనా గుండె పోటుకు గురై చలనం లేకుండా పడిఉంటే తక్షణం ఏమి చేయాలంటే ?

హృదయ శ్వాస పునరుద్ధారణ ప్రక్రియగా చెప్పబడే సిపిఆర్‌ చేయడానికి వైద్యవిద్య చదివి డాక్టరై ఉండాల్సిన అవసరం ఏమిలేదు. ఎలాంటి విద్యార్హతలేకపోయిన ఈ ప్రక్రియపై కనీస అవగాహన ఉంటే సరిపోతుంది. అపద్కాలంలో ఒక మనిషి ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు.

Heart Attack : ఇటీ వలి కాలంలో గుండె పోటు మరణాలు అధిక మయ్యాయి. 30 ఏళ్లు కూడా నిండని యువత గుండె పోటుతో మృత్యువాత పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న ఆందోళన కరమైన పరిస్ధితి ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే హఠాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు మనిషిని బ్రతికించడానికి ఒక ప్రక్రియ ప్రస్తుతం అందరిలో చర్చనీయాంశంగా మారింది. ప్రక్రియ ద్వారా ఇటీవలి కాలంలో చావు అంచులను చూసి తిరిగి ప్రాణాలతో బయటపడ్డ వారు చాలా మంది ఉన్నారు. అదే కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్‌ దీనేనే సిపిఆర్‌గా పిలుస్తున్నారు.

హృదయ శ్వాస పునరుద్ధారణ ప్రక్రియగా చెప్పబడే సిపిఆర్‌ చేయడానికి వైద్యవిద్య చదివి డాక్టరై ఉండాల్సిన అవసరం ఏమిలేదు. ఎలాంటి విద్యార్హతలేకపోయిన ఈ ప్రక్రియపై కనీస అవగాహన ఉంటే సరిపోతుంది. అపద్కాలంలో ఒక మనిషి ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు. ఇటీ వలి కాలంలో ప్రతిఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాదా నికి గురైన వ్యక్తిని కాపాడటానికి సమీపంలో ఉన్న ఎవరైన సిపిఆర్‌ చేయవచ్చు.

READ ALSO : Heart Attack : సోమవారమే అధిక స్ధాయిలో గుండెపోటు ప్రమాదాలు చోటుచేసుకోవటానికి కారణాలు తెలుసా?

గుండె హఠాత్తుగా ఆగిపోయినట్లు కొన్ని సూచనలు ద్వారా తెలుసుకోవచ్చు. స్పృహ కోల్పోవుట, అంతవరకూ స్పృహలో ఉన్న మనిషి అమాంతం స్పృహ కోల్పోతే గుండె ఆగిపోయినట్లు అనుమానించాల్సిందే. నాడీ స్పందన కోల్పోవడం, నాడిని శరీరంలోని వివిధ భాగాల్లో పరీక్ష చేయవచ్చు. అలాగే ఎడమచేయి మణికట్టు దగ్గర బొటన వేలు వైపు ఉన్న నాడి పరీక్షించటం ద్వారా మనిషి నాడీ స్పందనను కనిపెట్టవచ్చు.

సీపిఆర్ చేయటం ఎలాగంటే ;

ఎవరైన వ్యక్తి గుండె పోటుకు గురై అచేతనంగా పడిఉంటే వెనువెంటనే వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టాలి. కాలాన్ని వృధా చేయకుండా శ్వాస ద్వారాల వద్ద ముక్కు, నోరు, గొంతులో ఏమైనా అడ్డుకుని ఉంటే తీసివేసి శుభ్రపరచాలి. రొమ్ము ఎముక కింది భాగం మీద ఒక అరచేతి మీద ఇంకొక అరచేతిని ఆనించి గట్టిగా వెన్నెముకవైపు వత్తితే గుండెకు వత్తిడి కలిగి ఆ కారణంగా గుండెలో ఉన్న రక్తం శరీరానికి, ముఖ్యంగా మెదడుకు ప్రసరణమవుతుంది. ఈ ప్రక్రియను నిముషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. గుండె, రొమ్ము ఎముకకు, వెన్నెముకకు మధ్య ఛాతీలో ఉంటుంది.

READ ALSO : Hereditary Heart Disease : వంశపారంపర్యంగా గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి?

అదే సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తి నోటి ద్వారా శాసనందించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి ముక్కును మూసి ఉంచాలి. రెండవ విధానంలో నోటి ద్వారా ప్రమాదానికి గురైన వ్యక్తి ముక్కుద్వారా శ్వాసనందించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి నోటిని మూసి ఉంచాలి. గుండె వత్తిడి, కృత్రిమ శ్వాస ప్రక్రియలు విడి విడిగా వివరించినా, రెండూ ఒకే సమయంలో చేయాలి. సిపిఆర్‌ ప్రక్రియ విజయవంతమైందని తెలుసుకోవడానికి నాడి మళ్లీ అంది వ్యక్తి కనురెప్పలు స్పందిస్తాయి.

 

ట్రెండింగ్ వార్తలు