×
Ad

Valentine Week 2026 : వాలెంటైన్స్ డే వీక్.. ఫిబ్రవరి 13న కిస్ డేనా? ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? ముద్దు వెనుక అసలు కథేంటి?

Valentine Week 2026 : వాలెంటైన్స్ వీక్‌లో ఈరోజు కిస్ డేకు ప్రత్యేకత ఉంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, ప్రామిస్ డే, టెడ్డీ డే, హగ్ డే తర్వాత 13 ఫిబ్రవరి 2026న కిస్ డే జరుపుకుంటారు. ఈరోజు కిస్ డే ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

  • Published On : February 13, 2026 / 05:31 PM IST

Valentine Week 2026 Kiss Day

  • ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు
  • ఈరోజు (ఫిబ్రవరి 13న) కిస్ డే స్పెషాలిటీ
  • వాలెంటైన్స్ డేకి కేవలం ఒక రోజు ముందు కిస్ డే వస్తుంది

Valentine Week 2026 : వాలెంటైన్స్ వీక్.. ఈ ఫిబ్రవరిలో ప్రేమికులకు ఎంతో ముఖ్యమైన వారం.. ఈ 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 7 నుంచి మొదలై ఫిబ్రవరి 14 వరకు అద్భుతమైన క్షణాలను ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఉదయం నుంచి ఈ వాలెంటైన్స్ వారంలో ఈరోజు ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఈరోజు కిస్ డే.. ఫిబ్రవరి 13న కిస్ డే జరుపుకుంటారు. మీ ప్రియమైనవారికి ఈ ప్రత్యేకమైన రోజున ముద్దు ద్వారా మీ ప్రేమను తెలపవచ్చు.

ఫిబ్రవరి 13న కిస్ డేనా? :
ఫిబ్రవరి నెల ప్రేమ, భావోద్వేగాల సీజన్‌ అంటారు. ప్రస్తుతం వాలెంటైన్స్ వీక్ 2026 నడుస్తోంది. ఈరోజు, 7వ రోజు, ఫిబ్రవరి 13 కిస్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున కేవలం తమ భావాన్ని వ్యక్తీకరించేందుకు అద్భుతమైన అవకాశం.

ప్రేమ జంటలకు ఈ ముద్దు ఒక అద్భుతమైన క్షణం. వాలెంటైన్స్ డేకి కేవలం ఒక రోజు ముందు వచ్చే ఈ రోజు ప్రేమకు కొత్త మాధుర్యాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను కూడా కేవలం ముద్దుతోనే చెప్పొచ్చు.

Read Also : Best CNG Mileage Cars : బడ్జెట్‌లో బెస్ట్ కారు, ఫ్యామిలీ మెచ్చిన కారు.. మైలేజీలో నంబర్ వన్ CNG మోడళ్లు ఇవే!

వాలెంటైన్స్ వీక్‌లో కిస్ డే ఎప్పుడంటే? :

ఫిబ్రవరి 7న రోజ్ డేతో వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9న చాక్లెట్ డే, ఫిబ్రవరి 10న టెడ్డీ డే, ఫిబ్రవరి 11న ప్రామిస్ డే, ఫిబ్రవరి 12న హగ్ డే వస్తాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 13న కిస్ డే వస్తుంది. కిస్ డే అత్యంత ముఖ్యమైన రోజు. జంటల్లో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో ఈ ముద్దుతోనే తెలుసుకోవచ్చు.

కిస్ డే ఏంటి? :
కిస్ డే అనేది ప్రేమజంటలతో లింక్ అయి ఉంటుంది. ప్రేమ కేవలం ప్రేమికులకు మాత్రమే పరిమితం కాదు. చాలా మంది తల్లిదండ్రుల నుదిటిపై ముద్దు పెట్టుకోవడం ద్వారా వారి ప్రేమను వ్యక్తం చేస్తారు. మరికొందరు తమ పిల్లలకు బుగ్గపై ముద్దుపెట్టి తమ ఆప్యాయతను వ్యక్తం చేస్తారు. నిజానికి ముద్దు అనేది నమ్మకం, ఆప్యాయత, భద్రతకు చిహ్నం. అవతలి వ్యక్తికి మీకు ఎంత అనుబంధం ఉందో తెలియజేస్తుంది.

కిస్ డే హిస్టరీ ఏంటి? :
వాస్తవానికి, కిస్ డే గురించి ఎలాంటి చారిత్రక రికార్డులు లేవు. పాశ్చాత్య దేశాలలో వాలెంటైన్స్ డేతోనే కిస్ డేకు ప్రజాదరణ పెరిగింది. ప్రాచీన రోమన్ నాగరికత నుంచి ఆధునిక కాలం వరకు, ముద్దు ఎల్లప్పుడూ ప్రేమ, గౌరవానికి చిహ్నంగానే ఉంది. ఈ సంప్రదాయం యువతలో రానురాను బాగా ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియా యుగంలో కిస్ డే మరింత పాపులర్ అయింది.

ఏ రోజు తర్వాత ఏ రోజు? :
ఫిబ్రవరి 13 తర్వాత ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వస్తుంది. ఈ రోజున జంటలు తమ ప్రేమను జరుపుకుంటారు. ఎక్కువ సమయం ఆనందంగా గడుపుతారు.