Best CNG Mileage Cars : బడ్జెట్లో బెస్ట్ కారు, ఫ్యామిలీ మెచ్చిన కారు.. మైలేజీలో నంబర్ వన్ CNG మోడళ్లు ఇవే!
Best CNG Mileage Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మీరు CNG కారు కొనాలనుకుంటే ఇది మీకోసమే.. టాప్ ఫ్యూయిల్ ఎఫిషియంట్ మోడల్స్ పై ఓసారి లుక్కేయండి.
Best CNG Mileage Cars
- పెట్రోల్ టెన్షన్ లేని కార్లు.. టాప్ సీఎన్జీ మైలేజీ కార్లు
- ఈ సెలెరియో కారు ధర రూ. 4.69 లక్షల (ఎక్స్-షోరూమ్)
- మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రూ. 4.98 లక్షల (ఎక్స్-షోరూమ్)
- మారుతి సుజుకి ఆల్టో K10 ధర రూ. 3.69 లక్షలు
Best CNG Mileage Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో సీఎన్జీ కారు కొనేసుకోవచ్చు. ఈ CNG కార్లు అద్భుతమైన మైలేజీని అందిస్తాయి. సిటీలో డ్రైవింగ్ కోసమైనా లేదా ఆఫీసులకు వెళ్లాలన్నా మీకు చౌకైన ధరలో మంచి సీఎన్జీ కారు కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఇంతకీ ఏ CNG కారు ధర ఎంత? మైలేజీ ఎంత ఇస్తాయో వివరంగా తెలుసుకుందాం..
మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ :
మారుతి సుజుకి సెలెరియో అత్యంత సరసమైన కారు. మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఈ సెలెరియో సరసమైన కారు ధర రూ. 4.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ వేరియంట్ సుమారు 34.43 కిమీ/కిలో మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్జీ :
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి వచ్చిన వ్యాగన్ఆర్ కూడా మీ బడ్జెట్లో ధరలోనే లభిస్తోంది. ఈ సరసమైన కారు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రూ. 4.98 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్జీ వేరియంట్ సుమారు 34.05 కిమీ/కిలో మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్జీ :
భారత మార్కెట్లో బాగా పాపులర్ అయిన సరసమైన మోడల్ మారుతి సుజుకి ఆల్టో. మీరు ఈ కారును కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. మారుతి సుజుకి ఆల్టో K10 ధర రూ. 3.69 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఈ కారు సీఎన్జీ వేరియంట్ 33.85 కిమీ/కిలో మైలేజీని అందిస్తుంది.
టాటా పంచ్ సీఎన్జీ :
టాటా నుంచి వచ్చిన టాటా పంచ్ కారు ఇప్పుడు సరసమైన ధరలో లభిస్తోంది. ఈ టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది. మైలేజ్ పరంగా పరిశీలిస్తే.. టాటా పంచ్ CNG వేరియంట్ సుమారు 27 కి.మీ/కి.గ్రా మైలేజీని అందిస్తుంది.
