Mong Dal Atta
Pesara Flour : అందంగా కనిపించాలంటే కాస్త శ్రద్ధ తప్పనిసరి. దీనికి అందుబాటులో ఉండే వంటింటి వస్తువులు సరిపోతాయి. అలాంటి వాటిల్లో పెసరపిండి కూడా ఒకటి. పెసర పెండి తో ఎన్నో లాభాలు ఉన్నాయి.. చర్మం మరింత మెరవాలంటే ఈ పిండిని ఎక్కువగా వాడతారు. మొటిమలు,మొటిమల మచ్చలు,జిడ్డుని ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ పెసరపిండి బాగా తోడ్పడుతుంది.
చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కప్పు పెసర పిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
మూడు టీ స్పూన్ల పెసరపిండి, ఒక టీ స్పూను బియ్యప్పిండి, కొద్దిగా పసుపు వేసి దానికి రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలోని మురికి, బ్యాక్టీరియా పోయి చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.
రెండు మూడు చెంచాల పెసర పిండీ, పావుకప్పు పెరుగు, చెంచా తేనె, చిటికెడు పసుపూ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం శుభ్రంగా కడుక్కున్నాక పూతలా వేసి, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై ముడతు, మొటిమలు తాలూకా మచ్చలు తొలగిపోతాయి.
పార్టీకో, ఫంక్షన్ కో వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో కొద్దిగా పెసర పిండిలో చెంచా తేనె, పావు చెంచా కలబంద గుజ్జు, అరచెంచా బొప్పాయి పేస్ట్ కలుపుకొని మెత్తగా చేసుకుని ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. దీని వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. తాజాగా కనిపిస్తారు.
మెడా, మోచేతులు నల్లగా మారి, బరకగా ఉంటె అలాంటప్పుడు పావుకప్పు పెసరపిండిలో చెంచా నిమ్మరసం, గులాబీ నీరు కలిపి పేస్ట్ లా తయారూ చేసి సమస్య ఉన్న ప్రాంతాల్లో పూతలా రాయండి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మ కాంతివంతంగా తయారవుతుంది.
రెండు టీ స్పూన్ల పెసరపప్పు పొడిని తీసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిపాలను కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి. ఆ తర్వాత పదిహేను ఇరవై నిమిషాలకు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి… ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన చక్కటి ఫలితాలను పొందగలరు.
గుడ్డులోని తెల్లసొనలో చెంచా పురుగు, చెంచా పెసరపిండీ, అరచెక్క నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. జిడ్డు సమస్య తొలగిపోతుంది.
పావుకప్పు పెసర పిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జూ, చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే ముఖంపై పేరుకున్న నలుపు పోయి తాజాగా కనిపిస్తుంది. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.