Zero Size : జీరో సైజుకోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత

సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే చిత్రాల్లో మరింత స్లిమ్‌గా కనిపించాలనే తాపత్రయం సన్నగా మారడానికి ప్రయోగాలు చేసే దిశగా మళ్లిస్తుంది. సన్నగా, నాజూగ్గా, జీరోసైజ్‌ ఫిగర్, పర్ఫెక్ట్‌ ఫ

Size Zero

Zero Size : ఇటీవలి కాలంలో జీరో సైజు అనే మాట బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు జీరో సైజు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అయితే వీరిని ఫాలో అవుతూ ముఖ్యంగా అమ్మాయిలు జీరో సైజు కోసం తిండి కూడా సరిగా తినకుండా కోరి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఖచ్ఛితమైన శరీర ఆకృతిని పొందేందుకు వారు పడుతున్న తపన అంతాఇంతా కాదు. ప్రపంచంలో దాదాపు 69 మిలియన్ల మంది మహిళలు మంచి శరీర ఆకృతి కోసం కడుపు మాడ్చుకుంటున్నట్లు మిరాసోల్‌ ఈటింగ్‌ డిజార్డర్‌ రికవరీ సంస్థ స్పష్టం చేసింది. సన్నగా, నాజుగ్గా ఉంటే మేలన్నమాటలతో వీరంతా తిండితినటం మానేస్తున్నారు. దీనిఫలితం వారిలో అనొరెక్సియా వంటి ప్రమాదకర ఆరోగ్యసమస్యల బారిన పడుతన్నారు.

సాధారణంగా పురుషుడు అంటే శారీరకంగా దృఢంగా ఉంటాడు. స్త్రీ అంటే సున్నితంగా, సన్నగా ఉంటుంది అనేది సర్వత్రా అందరిలోనూ ఉన్న ఆలోచన. అమ్మాయిలు నాజూకుగానే ఉండాలనే విషయంలో స్లిమ్, జీరోసైజ్, కచ్చితమైన శరీర కొలతల కోసం చేసే ప్రయోగాలు చివరకు ప్రాణాపాయపరిస్ధితికి దారితీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ నటి శ్వేతా తివారి షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సృహ తప్పిపడిపోయి, ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల్లోనే ఏకంగా పది కేజీల బరువు తగ్గిన శ్వేత తాను తీసుకున్న ఆహార నియమాల వల్లే ఇలా ఆమే అకస్మాత్తుగా ఆనారోగ్యం పాలైనట్లు స్పష్టమైంది.

సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే చిత్రాల్లో మరింత స్లిమ్‌గా కనిపించాలనే తాపత్రయం సన్నగా మారడానికి ప్రయోగాలు చేసే దిశగా మళ్లిస్తుంది. సన్నగా, నాజూగ్గా, జీరోసైజ్‌ ఫిగర్, పర్ఫెక్ట్‌ ఫిగర్, లాంటి మాటలు ఇటీవల కాలంలోబాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో తమ జీరో సైజ్‌ ఫొటోలకు ఎన్ని లైక్‌లు, షేర్‌లు కోరుకునే వారు ఎక్కువయ్యారు. వయసును దాచడానికి కూడా సన్నబడటం ఒక ప్రామాణికంగా మారింది. కొద్దిరోజుల క్రితం 40 ఏళ్ల శ్వేత తివారీ తన ఫొటోషూట్‌ని సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ఆమె గతంలో కన్నా చాలా సన్నగా, కొత్త స్టైల్‌లో కనిపించింది. ఈ ఫోటోలు ఎంతోమంది అమ్మాయిలకు ప్రేరణగా నిలిచాయని చెప్పవచ్చు. ఈ జీరోసైజ్ ప్రయోగాల ఫలితంగా నవ్వడం, ఆడటం, తినడం, తాగడం వంటివి కూడా కేలరీలలో లెక్కించడం ప్రారంభిస్తున్నారు. చివరకు ప్రమాదకరమైన వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

డిజిటల్‌ మీడియా రాకతో యువత జీరోసైజు వేలం వెర్రిగా మారింది. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ఒక ప్రదర్శనలో అందం గురించి మాట్లాడుతూ నేను గతంలో అందం ప్రమాణాలలో కోసం తాను చేసిన ప్రయోగాల కారణంగా చివరకు తిన్న ఆహారం వాంతులు చేసుకోవడమే దినచర్యగా మారిందని చెప్పింది. ఆతరువాత కాలంలో కోలుకోగలిగినట్లు పేర్కొంది. ప్రిన్సెస్‌ డయానా సైతం ఈ సమస్యతో బాధపడిందని, అనొరెక్సియా వ్యాధికి గురైందని బ్రిటీష్‌ కుటుంబ జీవిత ఆధారంగా ది క్రౌన్‌ సీరిస్‌లో తెలిపారు.

ఈటింగ్‌ డిజార్డర్స్‌పై పనిచేస్తున్న మిరాసోల్‌ అనే అంతర్జాతీయ సంస్థ నివేదిక ప్రకారం 43 మిలియన్ల మంది మహిళలు తాము తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండాలనుకుంటుండగా, 26 మిలియన్ల మహిళలు తమ శరీర ఆకృతిని ఏవిధంగానైనా కాపాడుకోవాలి అనుకుంటున్నారట. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 69 మిలియన్ల మంది మహిళలు తమ శరీరాన్ని నాజూగ్గా, సన్నగా ఉంచేందుకు సరిగా ఆహారం తీసుకోకుండా ఆకలితో కడుపు మాడ్చుకుంటున్నట్లు నివేదికలో తేలింది. ప్రపంచంలో పురుషుల్లో కేవలం 0.3 శాతం మందిలోనే రక్తహీనత ఉంటే, ఇది మహిళల్లో ఒక శాతం ఉంది. 15 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో ఈ ప్రభావం అధికంగా ఉందన్న విషయం స్పష్టమైంది.

అమ్మాయిల్లో జీరో సైజ్‌ సమస్య పెరుగుతున్న ఈ కాలంలో వారిని ఆ ప్రభావం నుంచి బయట పడేయడానికి కుటుంబసభ్యులు, మిత్రుల సాయం తప్పనిసరి. పోషకాహార నిపుణులు, మానసిక నిపుణుల సాయంతో జీరో సైజు ఆలోచననుండి బయటపడవెయ్యొచ్చు.