Aakali Rajyam : ‘ఆకలి రాజ్యం’ వెబ్ సిరీస్ రివ్యూ.. బిటెక్ నిరుద్యోగుల కథ..

ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. (Aakali Rajyam)

  • Published on- August 29, 2026 / 02:19 PM IST

Aakali Rajyam

Aakali Rajyam : వికాస్ వశిష్ఠ, గీత్ సైని, రాజేష్ ఖన్నా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సిరీస్ ఆకలి రాజ్యం. ఏ టెలి ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజవేలు, పద్మిని నిర్మాణంలో నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికొస్తే..

రమేష్(వికాస్ వశిష్ఠ), అక్షయ్(రాజేష్ ఖాన్), అరుణ(గీత్ సైని) ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. బిటెక్ అయిపోయాక హైదరాబాద్ లో ముగ్గురూ ఒకే రూమ్ లో ఉంటూ జాబ్స్ ట్రై చేస్తూ దరిద్రంలో బతుకుతూ ఉంటారు. రమేష్ జాబ్స్ ట్రైల్స్ చేస్తూ ఉంటాడు. అక్షయ్ కి చేస్తున్న జాబ్ లో పొజిషన్ మార్చి శాలరీ తాగిస్తారు. అరుణ ఇంట్లో డబ్బులు ఇవ్వాలి కానీ ఆమె జాబ్ పోతుంది. మరోవైపు వీళ్ళ రూమ్ ఓనర్ బిట్టు భాయ్ (రమేష్ ఈరావేన) రెంట్ కోసం వీళ్ళని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు.

అనుకోకుండా అరుణ తండ్రి ఒక రోజు వీళ్ళ రూమ్ కి వచ్చి అరుణ అబ్బాయిలతో కలిసి ఉండటం చూసి షాక్ అవుతాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేయాలనుకుంటాడు. రమేష్ బిజినెస్ పెట్టి ఎదగాలని ఇంట్లో వాళ్ళను డబ్బులు అడిగినా సపోర్ట్ చేయరు. ఇక అక్షయ్ ఇంట్లో అన్నావదినలు ఏం అనకపోయినా తనే సపోర్ట్ చేయట్లేదని ఫీల్ అయిపోతూ ఉంటాడు. మరి ఈ ముగ్గురికి అనుకున్న జాబ్స్ వస్తాయా? లైఫ్ లో సెటిల్ అవుతారా? బిట్టు భాయ్ వల్ల వీళ్ళు ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? అరుణ వాళ్ళ నాన్న ఏం చేస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే..

Also Read : Bigg Boss 10 : బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ డేట్ అనౌన్స్.. ఎప్పట్నించి అంటే.. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు?

సిరీస్ విశ్లేషణ..

ఆకలి రాజ్యం అనే టైటిల్ తోనే ఆసక్తి నెలకొల్పారు. కమల్ హాసన్ నిరుద్యోగ బాధలు చూపిస్తూ ఆకలిరాజ్యం సినిమా తీస్తే అది క్లాసిక్ గా నిలిచింది. అదే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ముగ్గురు బిటెక్ చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగులు ఏం చేసారు అనే రొటీన్ కథ. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్, ఆ ముగ్గురు కష్టాలు, ఆ ముగ్గురి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎమోషన్ తో సిరీస్ సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ అరగంటగా మూడు ఎపిసోడ్స్ రిలీజ్ చేసారు. మూడో ఎపిసోడ్ లో నెక్స్ట్ లీడ్ ఇచ్చారు. మరి మొదటి సీజన్ ఎండ్ అయిపోయిందా లేక నాలుగో ఎపిసోడ్ నుంచి వారం వారం ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారా చూడాలి.

అరుణ ఎనిమిదేళ్లుగా అక్షయ్, రమేష్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. కానీ వాళ్లెవరో అసలు తన తండ్రికి తెలియకపోవడం ఏంటో.. ఈ ముగ్గురిలో సంపాదించేది అక్షయ్ కానీ అక్షయ్ రూమ్ రెంట్, అక్షయ్ కోర్స్ ఫీజ్ కూడా ఏ పని చేయని రమేష్ కట్టడం ఏంటో.. ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ మాత్రం కొన్ని ఉంటాయి. కామెడీతో మాత్రం అక్కడక్కడా నవ్విస్తారు. క్లైమాక్స్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. కొన్ని కొన్ని సీన్స్ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ చూసినట్టు అనిపిస్తాయి. బిటెక్ చదివి లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు, జాబ్స్ లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. కానీ దర్శకుడికి బిటెక్ పై కోపం ఉందేమో అసలు బిటెక్ అంటే పనికిరాదు అనే వీర లెవల్లో డైలాగ్స్ రాసుకున్నారు చాలా చోట్ల. ఒకసారి టైం పాస్ కి అక్కడక్కడా ఫార్వార్డ్ చేసుకుంటూ చూడొచ్చు ఈ సిరీస్ ని. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వీళ్ళు ఎలా ఎదుగుతారు? లేదా వీళ్ళకు మళ్ళీ ఎలాంటి కష్టాలు వస్తాయి? వీళ్ళకు వచ్చిన ఆలోచన ఎలా ముందుకు తీసుకెళ్తారు అని సాగబోతోంది.

Also Read : King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..

నటీనటులు, సాంకేతిక విశ్లేషణ..

గీత్ సైని, వికాస్ వశిష్ఠ, గీతా సైని.. ముగ్గురు మెయిన్ లీడ్స్ లో చాలా బాగా నటించారు. బిట్టు భాయ్ పాత్ర కూడా బాగానే మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. రియల్ లొకేషన్స్ అవ్వడం కలిసొచ్చింది. చాలా చోట్ల ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. రెగ్యులర్ కథ, కథనంతో రాబోయే ఎపిసోడ్స్ లో ఏదో ఉండబోతుంది అనే ఉత్కంఠతో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే ఈ సిరీస్ ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.