Paramapada Sopanam Review: అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ సినిమా రివ్యూ.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
అర్జున్ అంబటి హీరోగా వచ్చిన పరమపద సోపానం మూవీ(Paramapada Sopanam Review) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
arjun ambati paramapada sopanam movie review and rating
Paramapada Sopanam Review: అర్జున్ అంబటి, జెనిఫర్ ఇమాన్యుయేల్ జంటగా నటించిన యాక్షన్-రివెంజ్ డ్రామా ‘పరమపద సోపానం(Paramapada Sopanam Review)’. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన నాగ శివ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏప్రిల్ 24న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
హెల్త్ కమిషనర్ సత్యప్రకాశ్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ క్లిష్టమైన కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అశ్వద్ధామ రంగంలోకి దిగుతాడు. అయితే ప్రతి మృతదేహంపై నెక్స్ట్ చావబోయే వ్యక్తి వేలిముద్రలు దొరకడం కేసును మరింత మిస్టరీగా మారుస్తుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిని అర్జున్ గుర్తిస్తాడు. అర్జున్ ఒక గేమ్ డిజైనర్. మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసుకునే అర్జున్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు, ఎవరో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే భయం అతన్ని వెంటాడుతుంటుంది.
Balayya- Koratala: ఒకరు హ్యాపీ.. ఒకరు డిజప్పాయింట్.. బాలయ్య సినిమాతో దేవర 2పై క్లారిటీ
అర్జున్ భద్రత కోసం సీఐ నేహాను నియమిస్తారు. కానీ హత్యలు అక్కడితో ఆగవు… ప్రభుత్వ ఉద్యోగులు షబీనా భేగమ్, జాన్ రాజ్ కూడా క్రూరంగా హత్యకు గురవుతారు. ఈ హత్యల వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అర్జున్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? హెల్త్ మినిస్టర్ పురుషోత్తం రెడ్డి పాత్ర ఏమిటి? ఈ మొత్తం కథకు ‘పాలకడలి’ గ్రామంతో ఉన్న రహస్య సంబంధం ఏంటి? ఈ మిస్టరీకి సమాధానం తెలుసుకోవాలంటే ‘పరమపద సోపానం’ చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు నాగ శివ తన తొలి చిత్రానికే బలమైన కథను ఎంచుకుని, సోషల్ ఎలిమెంట్‌తో కూడిన కమర్షియల్ సినిమాను సమర్థంగా తెరకెక్కించాడు. సినిమా చూస్తున్నంతసేపు ఇతను డెబ్యూ డైరెక్టర్ అన్న భావనే రాదు. అనుభవజ్ఞుడైన దర్శకుడిలా ప్రతి ఫ్రేమ్‌ను హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సీరియల్ కిల్లింగ్ ఎపిసోడ్స్, వాటి చుట్టూ నడిచే సస్పెన్స్, మధ్య మధ్యలో వచ్చే కామెడీ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేస్తాయి. కమెడియన్ మెహబూబ్ బాషా తన టైమింగ్‌తో అలరించాడు. ఇంటర్వల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో కథను దర్శకుడు వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను షాక్ కి గురిచేస్తుంది. క్లైమాక్స్‌లో ఐటెమ్ సాంగ్, ఫైట్ సీక్వెన్స్‌లు కమర్షియల్ టచ్‌ను పెంచాయి. తక్కువ బడ్జెట్లో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అందించడం పెద్ద ఛాలెంజ్ ఈ విషయంలో నాగ శివ సక్సెస్ సాధించాడు. సంగీత దర్శకుడు దేవ్ జండ్ కూడా తన సంగీతంతో సినిమాకు బలం చేకూర్చాడు. మొత్తం మీద, ఈ చిత్రం మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.
Neha shetty: స్టన్నింగ్ లుక్ లో నేహా శెట్టి.. గోల్డ్ కలర్ అవుట్‌ఫిట్‌లో పరువాల విందు.. ఫొటోలు
నటీనటులు:
అర్జున్ అంబటి ఈ కథకు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలిచాడు. అతను అండర్రేటెడ్ యాక్టర్ అన్నది ఈ సినిమాతో మరోసారి స్పష్టమైంది. అర్జున్ కటౌట్‌ను కరెక్ట్‌గా ఉపయోగించిన చిత్రం ‘పరమపద సోపానం’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌లో అర్జున్ అదరగొట్టేశాడు. హీరోయిన్ జెనిఫర్ ఇమ్మాన్యుల్ కూడా పోలీస్ పాత్రలో మెప్పించింది. ఆమెకు ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ లభించింది అని చెప్పాలి. అలాగే “చిన్ని చిన్ని తప్పులేవో” సాంగ్‌లో ఆమె గ్లామర్ యూత్ హృదయాలను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అజయ్ రత్నంకి చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ దొరికింది. సీనియర్ నటుడు పిల్లా ప్రసాద్ కూడా విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు.
మొత్తంగా ‘పరమపద సోపానం’లో ప్రేక్షకులు మెచ్చే అన్ని కమర్షియల్ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో, సెకండాఫ్‌లో సోషల్ ఎలిమెంట్, క్లైమాక్స్ మెప్పిస్తాయి. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు
