Madhuraapuri Sadana Review : ‘మధురాపురి సదన’ మూవీ రివ్యూ.. తెలుగు ఓటీటీలో కొత్త సినిమా ఎలా ఉందంటే..?
మధురాపురి సదన అనే సినిమా టైటిల్ చూసి ఇదేదో మెలోడీ, క్లాసిక్ లవ్ స్టోరీ అనుకుంటాం. (Madhuraapuri Sadana Review)
- Saketh U
- Published on- July 16, 2026 / 02:02 PM IST
Madhuraapuri Sadana Review
Madhuraapuri Sadana Review : భరత్ సాయినాథ్ వర్మ, యషు మాశెట్టి జంటగా తెరకెక్కిన సినిమా మధురాపురి సదన. భరత్ సాయినాథ్ వర్మ, పద్మనాభరెడ్డి నిర్మాణంలో సాయి తరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మధురాపురి సదన సినిమా నేడు జులై 16 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చింది.
కథ విషయానికొస్తే..
కృష్ణ(భరత్ సాయినాథ్ వర్మ) సినిమా దర్శకుడు అవ్వాలని కలలు కంటాడు. తన ఫ్రెండ్స్ టిన్ టిన్, శ్రీను అన్న(సుశాంత్ నాయుడు)లతో కలిసి తిరుగుతూ ఉంటాడు. కృష్ణ తండ్రి(శ్రీనివాస్ భోగిరెడ్డి), తల్లికి ఎప్పటికైనా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటారు. కృష్ణ అక్క అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటుంది. ఒకప్పటి తన క్రష్ అదితి(యషు మాశెట్టి) మళ్ళీ కనిపించడంతో కృష్ణ ప్రేమ మొదలవుతుంది.
కృష్ణ పేరెంట్స్ అమెరికాకు వెళ్లిన సమయంలో అదితి ఇంట్లో వీళ్ళ విషయం తెలిసి వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. కృష్ణ తండ్రి తనకు సేవ్ చేసిన కొన్ని డబ్బులతో ఇల్లు కట్టుకుందామని ఓ స్థలం కొంటాడు. మరి వీళ్ళు సొంతిల్లు కట్టుకున్నారా? కృష్ణ దర్శకుడు అయ్యాడా? కృష్ణ – అదితి ప్రేమకథ ఏమైంది? ఆ ఏరియాలో ఉండే థియేటర్ ఓనర్ కృష్ణ లైఫ్ ని ఎలా మారుస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే..
Also Read : Fauzi : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. షర్ట్ లేకుండా ప్రభాస్ పోస్టర్ అదిరిందిగా..
సినిమా విశ్లేషణ..
మధురాపురి సదన అనే సినిమా టైటిల్ చూసి ఇదేదో మెలోడీ, క్లాసిక్ లవ్ స్టోరీ అనుకుంటాం. కానీ సినిమా చూసాక అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అని ఆలోచించాలి. హీరో, అతని ఫ్యామిలీ ఓ ఇంట్లోకి రెంట్ కి వచ్చినట్టు కథ ఓపెన్ చేస్తారు. అక్కడ మొదలైన కథ చివరి వరకు సాగదీస్తూనే ఉన్నారు. ఓ షార్ట్ ఫిలిం కథని, రియల్ లైఫ్ లో నిర్మాత, డైరెక్టర్ తమకు జరిగేవి అన్ని ఈ కథలో పెట్టరేమో అనిపిస్తుంది. ఎప్పట్నుంచో ప్రేమించుకున్నట్టు కృష్ణ అదితిల ప్రేమ చూపిస్తారు కానీ మొదటిసారి తమ ఏరియాలో చూసినట్టు మాట్లాడే సీన్ తో పరిచయం అవ్వడం ఏంటో అర్థంకాదు.
ఇక సొంత ఇల్లు కథని చాలా సాగదీశారు. అందుకు హీరో అక్క డబ్బులు ఇవ్వడం, ఓ ప్లాన్ ఇవ్వడం, హీరో అక్కకి తండ్రికి గొడవ అవ్వడం.. కాసేపు ఈ సినిమా కథ ఎటు వెళ్తుందో అనిపిస్తుంది. ఇక హీరో ఎక్కడో ఊళ్ళో ఉండి దర్శకుడు అవ్వాలని ఫ్రెండ్స్ తో తిరుగుతూ, ఎలాంటి ట్రైల్స్ వేయకుండానే కలలు కంటూ ఉంటాడు. దానంతట అదే ఛాన్స్ వస్తే హైదరాబాద్ కి వెళ్లి సినిమా తీయాలి అన్నట్టు హీరో క్యారెక్టర్ ఉండటం విశేషం. దర్శకుడిగా ఓ సినిమా ఓకే అయినట్టు చూపించే కథ బానే ఉన్నా చివర్లో ఇచ్చే ట్విస్ట్ రొటీన్. చాలా సినిమాల్లో చూసిందే. ఆ ట్విస్ట్ ఓ రికార్డింగ్ థియేటర్ సీన్ లోనే ఊహించేయొచ్చు.
ఈ కథ మధ్యలో అక్కర్లేని హీరో మామ పాత్ర, డబ్బులు మోసం చేయడం.. లాంటి కథకు సంబంధం లేని సీన్స్ ఎందుకో అర్ధం కాదు. ఇక ఈ సినిమా కరోనా సమయంలో తీశారు అని బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని విజువల్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఓ నాలుగైదేళ్ళ కిందటి సినిమా అని తెలుస్తుంది. సినిమాలో అందరికి తెలంగాణ యాస పెట్టారు కానీ ఒక్కరికి కూడా సెట్ అవ్వలేదు. చాలా కష్టపడి తెలంగాణ యాస మాట్లాడినట్టు ఉంది. లాస్ట్ 20 నిముషాలు మాత్రం కాస్త ఆసక్తిగా హీరో ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది అని సాగుతుంది. ఫ్రెండ్స్ తో అక్కర్లేని కామెడీ సీన్స్ రాసుకున్నారు కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒక్క చోట కూడా నవ్వు రాదు. చూడాలి అని సాహసం చేస్తే ఫార్వార్డ్ చేసుకుంటూ చూసేయడమే. ఒక సాగదీసిన షార్ట్ ఫిలిం అనే ఫీలింగ్ వస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
మెయిన్ లీడ్ లో నటించిన భరత్ సాయినాథ్ వర్మ చాలా కష్టపడి నటించడానికి ప్రయత్నించాడు అని తెలుస్తుంది. తనే నిర్మాత కాబట్టి తనే హీరోగా చేయాలి అనుకున్నట్టు ఉంది. టిన్ టిన్, శ్రీను అన్న పాత్రల్లో నటించిన నటులు అక్కడా పర్వాలేదు అనిపిస్తారు. హీరోయిన్ యషు మాశెట్టి కూడా అక్కడక్కడా కనిపించి షార్ట్ ఫిలిమ్స్ లవ్ స్టోరీల్లో కనిపించే హీరోయిన్స్ లా అనిపిస్తుంది. శ్రీనివాస్ భోగిరెడ్డి, నీలప్రియ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
Also Read : Vrushakarma : నాగచైతన్య ‘వృషకర్మ’.. వామ్మో నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లకు అమ్ముడయిందో తెలుసా?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ షార్ట్ ఫిలిం విజువల్స్ లా అనిపిస్తాయి. చాలా సీన్స్ లో విజువల్స్ అస్సలు బాగోవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. డబ్బింగ్ చాలా సీన్స్ లో సెట్ అవ్వలేదు. కొన్ని చోట్ల క్లియర్ గా లిప్ సింక్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. ఓ పాత రొటీన్ కథ, రొటీన్ సీన్స్, కథనంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎడిటింగ్ లో చాలా సీన్స్ కట్ చేయాలి, కొన్ని సీన్స్ షార్ప్ కట్స్ చేయాలి. నిర్మాణ పరంగా కూడా తక్కువ ఖర్చులో ఆల్మోస్ట్ రెండు, మూడు లొకేషన్స్ లోనే ఈ సినిమాని తీసినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘మధురాపురి సదన’ సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునే ఓ కుర్రాడు, సొంతిల్లు కావాలనుకునే ఆ కుర్రాడి పేరెంట్స్ కథని సాగదీసి చూపించారు. ఖాళీ సమయం, ఓపిక ఉంటే ఫార్వార్డ్ చేసుకుంటూ చూడొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
