NBK’s నర్తనశాల – రివ్యూ..

  • Publish Date - October 24, 2020 / 01:04 PM IST

NBK’s Narthanasala Review: సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన Mythological Epic ‘‘నర్తనశాల’’..




దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా విజయదశమి సందర్భంగా NBK Theatre లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24 ఉదయం విడుదల చేశారు. సినిమా ఎలా ఉందో చూద్దాం..
https://10tv.in/keerthy-suresh-miss-india-official-trailer/
ఆనాటి ‘నర్తనశాల’ అలాగే బాలయ్య ‘టాప్ హీరో’ సినిమా సభ్యులకు కృతజ్ఙతలు తెలియజేస్తూ.. ‘‘నేడు దశమి.. విజయదశమి.. ఈనాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం చేకూరుతుంది’’ అనే ఎన్టీఆర్ డైలాగుతో సినిమా ప్రారంభమవుతుంది.

12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండు కుమారులు వారి దాయాదులు ధుర్యోధనులకు తెలియకుండా మరో ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. ఆ సంవత్సరకాలం ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రశాంతంగా జరిగిపోవాలని, తిరిగి రాజపాలకులుగా పట్టాభిషిక్తులు కావాలని ఆకాంక్షిస్తుంటారు పాండు కుమారులు..




విరాటరాజు కొలువులో ఎవరు ఏ ఏ వృత్తి చేపట్టి మత్స్య దేశమందు నివాసముండాలని నిర్ణయిస్తాడు అర్జునుడు.. నకుల, సహదేవులు… అశ్వ, పశు సంరక్షకులు తామగ్రంథి, తంత్రీపాలుడు అనే పేర్లతోనూ..
జూదక్రీడను అస్త్రంగా ఉపయోగించి కంకుభట్టు పేరుతో ధర్మరాజు ప్రవేశించాలనుకోగా.. ద్రౌపది, మాలిని పేరుతో దాసిగా జీవిస్తాననడంతో భీముడు కోపగించుకుంటాడు.. ద్రౌపది శాంతింపజేయడంతో వలలుడు అనే పేరుతో విరాటరాజు కొలువులో చేరతానని భీముడు తన నిర్ణయం తెలియజేస్తాడు.. మరి అర్జునుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు.. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ..

తండ్రి తర్వాత పౌరాణిక పాత్రలు పోషించడం బాలయ్యకే సాధ్యం అనే విషయం ఇప్పటికే నిరూపణ అయింది. ఎన్టీఆర్ సినిమాలను తనకు నటగ్రంథాలుగా చెప్పుకునే బాలయ్య అర్జునుడిగా మెప్పించాడు. తనదైన శైలి సంభాషణలు, హావభావాలతో ఆకట్టుకున్నాడు. ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు తన నటనతో ఆకట్టుకున్నారు. చాలాకాలం తర్వాత స్వర్గీయ సౌందర్య, శ్రీహరిలను తెరమీద చూడడం కొత్త అనుభూతినిస్తుంది. వినోద్ యాజమాన్య నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది..




అర్జునుడు అమరావతికి వెళ్లినప్పుడు ఇంద్రసభలో జరిగిన సన్నివేశాన్ని వాడుతూ.. అప్పటి ఊర్వశి శాపం అజ్ఞాతవాసకాలంలో తనకు వరంగా పరిగణింపబడుతుంది అనే సన్నివేశాన్ని లీడ్‌గా తీసుకుని బృహన్నల పేరుతో అంత:పుర కాంతలకు నాట్యం, సంగీతం నేర్పాలని అర్జునుడు నిర్ణయించుకోవడం.. దానికి కొనసాగింపుగా బాలయ్య నటించిన ‘టాప్ హీరో’ చిత్రంలో ఒకపాటలో బాలయ్య బృహన్నలగా నర్తించే భాగాన్ని వాడుకుంటూ తండ్రి ఆశీస్సులు అందుకుంటూ సినిమాకు ముగింపునిచ్చాడు బాలయ్య.

తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని ప్రారంభించి అని వార్య కారణాలతో పక్కన పెట్టేసి ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులముందుకు తీసుకురావడం.. NBK Theatre లో శ్రేయాస్ ఈటి ద్వారా లఘచిత్రంగా విడుదల చేస్తూ.. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి సంకల్పించడం మంచి నిర్ణయం.. షార్ట్ ఫిల్మ్ నిడివిగల NBK’s Narthanasala అందర్నీ ఆకట్టుకుంటుంది.




ట్రెండింగ్ వార్తలు