Ugly Story Review : ‘అగ్లీ స్టోరీ’ మూవీ రివ్యూ.. వామ్మో ఇదెక్కడి సైకో ప్రేమకథ..

నందు ఇటీవల తనని తాను నిరూపించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్త కొత్త పాత్రల్లో తన నటనని అంతా చూపిస్తున్నాడు. (Ugly Story Review)

  • Updated on- May 22, 2026 / 02:23 PM IST

Ugly Story Review

Ugly Story Review : నందు, అవికా గోర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిని, కొండా ల‌క్ష్మ‌ణ్ నిర్మాణంలో ప్రణవ స్వరూప్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అగ్లీ స్టోరీ నేడు మే 22 న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

కార్తీక్(నందు)-నేహా(అవికా గోర్)భార్యాభర్తలు. కార్తీక్ నేహాని బాగా ఇష్టపడ్డాడు కానీ తనకే దక్కాలి, తాను చెప్పిందే చేయాలి అనే సైకోయిజంతో నేహాని టార్చర్ చేస్తూ ఉంటాడు. నేహా అతనితో ఇష్టంలేకుండానే పెళ్లి చేసుకొని మౌనంగా అన్ని భరిస్తూ ఉంటుంది. ఆమె గతంలో ఉన్న ప్రేమ గౌతమ్(రవి మహాదాస్యం)ని గుర్తుచేస్తూ నేహాని టార్చర్ పెడుతూ సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు కార్తీక్.

సడెన్ గా నేహా కనిపించకుండా పోతుంది. అసలు నేహా ఎక్కడికి వెళ్ళింది? కార్తీక్ అంత టార్చర్ చేస్తున్నా నేహా ఎందుకు భరిస్తుంది? నేహా గత ప్రేమకథ ఏంటి? నేహాకు ఇష్టంలేకపోయినా కార్తీక్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Ramani Kalyanam Review : ‘రమణి కళ్యాణం’ మూవీ రివ్యూ.. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..

సినిమా విశ్లేషణ..

నందు ఇటీవల తనని తాను నిరూపించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్త కొత్త పాత్రల్లో తన నటనని అంతా చూపిస్తున్నాడు. కానీ తన నటన మీద పెట్టిన దృష్టి కథల మీద పెట్టట్లేదు. అసలు ఈ అగ్లీ స్టోరీలో బలమైన కథే లేదు. సినిమా అంతా ముందుకు వెనక్కి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. నేహా జీవితం చుట్టూ ఈ కథ సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ నేహా ని రకరకాలుగా టార్చర్ పెట్టడమే సాగదీస్తూ చూపించారు. మధ్యమధ్యలో నేహా – గౌతమ్ కథ. ఇంటర్వెల్ కూడా సింపుల్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ అదే టార్చర్, కొంత కార్తీక్ – నేహా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నేహా కనిపించకుండా పోయాక కాస్త ఆసక్తిగా నడుస్తుంది. క్లైమాక్స్ లో ఏదో ట్విస్ట్ లు ఇచ్చారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అసలు కార్తీక్ అంత టార్చర్ పెడుతున్నా ఎందుకు భరిస్తుందో లాస్ట్ లో చెప్పారు కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా అనే చిన్న లాజిక్ ని మరిచిపోయారని క్లైమాక్స్ ట్విస్ట్ చెప్పాక అనిపిస్తుంది.

కొంతమంది సైకోలు తాము ప్రేమించే అమ్మాయి తమని కూడా ప్రేమించాలి అని బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ అబ్బాయి కథ ఇది అనుకోవడమే కానీ ఇందులో సినిమా కథ అయితే లేదు. అసలు ఆ పనిమనిషి పాత్ర ఎందుకు? ఇక కార్తీక్ ఇంట్లో అంత జరుగుతున్నా ఆమె ఎందుకు వెళ్లిపోవట్లేదో దర్శకుడికే తెలియాలి. అసలు నేహాని తప్ప వేరే అమ్మాయిని తనని ముట్టుకోనివ్వనివాడు నేహా అని భ్రమపడి పనిమనిషి దగ్గరికి ఎందుకు వెళ్తాడో దర్శకుడికే తెలియాలి.

నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అన్ని ఊహించొచ్చు. అసలు కార్తీక్ ఇలా ఎందుకు మారాడు అనేది కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. టార్చర్ సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఎంత సాగదీయాలో అంత సాగదీశారు. ఇక క్లైమాక్స్ లో ఆ సాంగ్ ఎందుకో. హీరో హీరోయిన్ ని టార్చర్ పెడుతుంటే మనం టార్చర్ ఫీల్ అవ్వాల్సిందే. ఫ్యామిలీతో, లవర్స్ తో మాత్రం ఈ సినిమాని చూడకపోవడమే బెటర్. ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఇంకా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం మాత్రం చేసారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

నందు మాత్రం నెగిటివ్ షేడ్స్ లో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అపరిచితుడిలా వెంటవెంటనే తన యాక్టింగ్ వేరియేషన్స్ చూపిస్తూ అదరగొట్టాడు. అవికా గోర్ కూడా ఒకసాధారణ భార్య పాత్రలో జీవించేసింది. రవి మహాదాస్యం కాసేపు కనిపించి పర్వాలేదనిపించారు. శివాజీ రాజా, ప్రగ్య నయన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Purushaha Review : ‘పురుషః’ మూవీ రివ్యూ.. భార్యాబాధితులు చూడాల్సిందే.. నవ్వుకోవాల్సిందే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. లొకేషన్స్ చాలా వరకు రియలిస్టిక్ గానే అనిపిస్తాయి. భార్యని భర్త ప్రేమ పేరుతో టార్చర్ చేయడం అనే పాయింట్ తో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతనికే తెలియాలి. సాంకేతికంగా మాత్రం బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఉన్నంతలో బాగానే తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

మోతంగా ‘అగ్లీ స్టోరీ’ ప్రేమ అంటూ భార్యని టార్చర్ పెట్టే భర్త కథతో తెరకెక్కిన సినిమా. కాస్త అగ్లీ.. కూసింత కూడా లేని స్టోరీ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తగత అభిప్రాయం మాత్రమే.