ప్రభాస్ 20 పూజ పిక్స్ వైరల్..

ప్రభాస్ 20వ సినిమా ప్రారంభోత్సవం నాటి ఫొటోలు వైరల్..

  • Published By: sekhar ,Published On : May 8, 2020 / 02:03 PM IST
ప్రభాస్ 20 పూజ పిక్స్ వైరల్..

Updated On : May 8, 2020 / 2:03 PM IST

ప్రభాస్ 20వ సినిమా ప్రారంభోత్సవం నాటి ఫొటోలు వైరల్..

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దర్శక నిర్మాతలు తదుపరి కార్యచరణలపై దృష్టి పెట్టగా, హీరో హీరోయిన్లు మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఈ సమయంలో అప్‌డేట్స్ ఎక్కడినుండి వస్తాయి. రావు కదా.. దానికి ఓ ఆప్షన్ ఉంది. అదే Throwback.. అవును, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం.. 

Prabhas 20

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. ‘జిల్‌’ ఫేం రాధా కృష్ణ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ పీరియాడికల్‌ లవ్‌ స్టోరి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాకు ముందు జార్జియాలో ఓ షెడ్యూల్‌ జరిగింది. తాజాగా సినిమాకు చెందిన ముహుర్తం ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకుంది మూవీ టీమ్.

​​Prabhas 20

పూజా కార్యక్రమానికి ప్రభాస్‌, కృష్ణం రాజు, రాజమౌళి, వివి వినాయక్‌, పూజాహెగ్డే, కోన వెంకట్‌, నిర్మాతలు వంశీ, ప్రమోద్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు ‘ఓ డియ‌ర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Prabhas 20