IB Recruitment 2025: పది పాసైతే చాలు.. ఇంటలీజెన్స్ బ్యూరో లో జాబ్స్.. నెలకు రూ.69 వేల జీతం.. ఒక్క క్లిక్ తో వెంటనే అప్లై చేసుకోండి

IB Recruitment 2025: హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఇంటెలిజెన్స్ బ్యూరో దేశ వ్యాప్తంగా 37 శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

IB Recruitment 2025: పది పాసైతే చాలు.. ఇంటలీజెన్స్ బ్యూరో లో జాబ్స్.. నెలకు రూ.69 వేల జీతం.. ఒక్క క్లిక్ తో వెంటనే అప్లై చేసుకోండి

Intelligence Bureau has released a notification for 4987 posts.

Updated On : August 14, 2025 / 5:41 PM IST

పది పాసైన వారికి గుడ్ న్యూస్. జాతీయ గూఢచార విభాగంలో పని చేసే అవకాశం పొందవచ్చు. ఈమేరకు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఇంటెలిజెన్స్ బ్యూరో దేశ వ్యాప్తంగా 37 శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 17తో ముగియనుంది. ఆసక్త, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ mha.gov.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హత:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణుత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి చెందిన డొమిసైల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇంటెలిజెన్స్ పనుల్లో అనుభవం ఉన్నవారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళ సడలింపు, విడాకులు తీసుకున్న మహిళలు, క్రీడాకారులకు, ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవ చేసినవారికీ కూడా మినహాయింపు ఉంటుంది.

వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.69,100 వరకు జీతం అందుతుంది.

ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. టియర్-1 (ఆబ్జెక్టివ్ రాత పరీక్ష), టియర్-2 (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), టియర్-3 (ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్) ఉంటాయి.

దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కు చెందిన పురుషులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ రూ.550 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.