హైదరాబాద్‌లో పవన్ ‘పింక్’ – అనంతపురంలో వెంకీ ‘అసురన్’

తెలుగు సినిమాలు - లేటెస్ట్ అప్ డేట్స్.. షూటింగ్ ప్రారంభమైన, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ఇవే..

  • Publish Date - January 20, 2020 / 11:43 AM IST

తెలుగు సినిమాలు – లేటెస్ట్ అప్ డేట్స్.. షూటింగ్ ప్రారంభమైన, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ఇవే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్  వికారాబాద్‌లో జరుగుతుంది. ఈ షూట్ లో తారక్, చరణ్‌లపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్‌లో.. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా రెండవ షెడ్యుల్ జనవరి 27 నుంచి కోకా పేట్‌లో 10 రోజులు జరుగనుంది. పిబ్రవరి 18 నుంచి రాజమండ్రిలో ఓ షెడ్యుల్ ప్లాన్ చేశారు.

కింగ్ అక్కినేని నాగార్జున అహితోష్ సోల్మన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ ఖైరతాబాద్‌లో జరుగుతుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్న (అసురన్ రీమేక్) సినిమా రెగ్యులర్ షూటింగ్ అనంతపురంలో జరుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, బోని కపూర్ సమర్పణలో, దిల్ రాజు నిర్మిస్తున్న ‘పింక్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదటి షెడ్యుల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. 10 రోజులు ఈ షెడ్యుల్ ఉంటుంది. ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’ టైటిల్ ప్రచారంలో ఉంది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా షూటింగ్ ముంబై‌లో ప్రారంభమైంది. 40 రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్  నిర్మిస్తున్న “రెడ్” సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.

శర్వానంద్ హీరోగా, కిశోర్ రెడ్డి దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ హైదరబాద్‌లో జరుగుతుంది.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న  “భీష్మ” సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. ఆ రెండు పాటలను ఈనెల 27 నుంచి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో షూట్ చేయనున్నారు.

నాగచైతన్య – సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘లవ్ స్టోరి’ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో వేసిన సెట్‌లో జరుగుతుంది.

రవితేజ, మలినేని గోపిచంద్ “క్రాక్” సినిమా షూటింగ్  హైదరాబాద్‌‌లో జరుగుతుంది. జనవరి 27నుంచి ఒంగోలు‌లో ఓ షెడ్యుల్ ప్లాన్ చేశారు.
 రానా హీరోగా, వేణు ఉడుగుల దర్శకత్వంలో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది.

గోపీచంద్‌, సంపత్‌నంది కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ యానాంలో జరుగుతుంది. ఈనెల 25వరకు ఈ షెడ్యుల్ ఉంటుంది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా bvsn ప్రసాద్ నిర్మిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా  షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది.

శంషాబాద్ పద్మాలయా స్టూడియోలో గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
రెజీనా ప్ర‌ధాన పాత్ర‌లో, కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా షూటింగ్ మేడ్చల్‌లో జరుగుతుంది.