Raveena Tandon: నటి రవీనా టండన్ ఇంట్లో రూ.25 లక్షల వజ్రాభరణాల చోరీ.. పనిమనిషే పక్కా ప్లాన్ చేసి

నమ్మించి మోసం చేసిన పనిమనిషి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్(Raveena Tandon) ఇంట్లో రూ.25 లక్షల వజ్రాల చోరీ.

25 lakh worth Diamonds stolen from Bollywood actress Raveena Tandon home

  • రవీనా టండన్ సోదరుడి ఇంట్లో చోరీ.
  • రూ.25 లక్షల విలువైన నగలు మాయం.
  • నమ్మకమైన కేర్‌టేకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Raveena Tandon: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ సోదరుడు రాజీవ్ టండన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో ముంబై జుహు పోలీసులు ఎట్టకేలకు ఒక మహిళను అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబరులో రాజీవ్ టండన్ ఇంట్లోని లాకర్ నుండి దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, ఖరీదైన చేతి వాచీలు మాయమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపగా, రవీనా టండన్ తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న 47 ఏళ్ల రాశి ఛాబ్రియా ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది.
Vasanthi Krishnan: సప్తశృంగి దేవి సన్నిధిలో బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి.. డివోషనల్ ఫోటోలు వైరల్!

గత 2020 నుండి ఈ కుటుంబంతో నమ్మకంగా ఉంటూ, ఇంట్లోని విలువైన వస్తువులు ఉండే గదుల్లోకి సైతం స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని రాశి ఛాబ్రియా సంపాదించుకుంది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అదును చూసి లాకర్‌లోని నగలను దొంగిలించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో తొలుత నేరాన్ని ఖండించినా, ఆ తర్వాత రెండు వాచీలను తిరిగి ఇచ్చేసి మిగిలిన నగలు జగదీష్ అనే వ్యక్తి వద్ద ఉన్నాయని ఒప్పుకుంది. అంతేకాకుండా, నగల విషయమై ఒత్తిడి తెస్తే టండన్ కుటుంబాన్ని నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

పోలీసులు మే 21న నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, మే 29 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇక రవీనా టండన్(Raveena Tandon) గతంలో తెలుగులో పలు చిత్రాల్లో నటించగా, ప్రస్తుతం ఆమె కుమార్తె రషా తడానీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో రషా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.