Rahul Ramakrishna : దర్శకుడిగా మారిన కమెడియన్.. సినిమా ఎప్పుడంటే.. హీరోగా మాత్రం చేయను అంటూ..
త్వరలో రాహుల్ రామకృష్ణ హుషారు 2 సినిమాతో రాబోతున్నాడు. (Rahul Ramakrishna)
Rahul Ramakrishna
Rahul Ramakrishna : అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో కనిపించి ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆ సినిమా తర్వాత వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా సినిమాలు చేస్తున్నాడు. హుషారు, బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు, ఓం భీం బుష్.. లాంటి పలు హిట్ సినిమాలలో ఫుల్ గా నవ్వించాడు. త్వరలో రాహుల్ రామకృష్ణ హుషారు 2 సినిమాతో రాబోతున్నాడు.
తాజాగా హుషారు 2 టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ అనంతరం రాహుల్ రామకృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను దర్శకుడిగా మారుతున్నట్టు ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
Also Read : Rajamouli : బ్రెజిల్లో రాజమౌళి.. వారణాసి అప్డేట్.. అక్కడ కూడా రిలీజ్ చేస్తామంటూ..
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. నాకు మెయిన్ లీడ్ గా, హీరోగా చేయాలని ఆశలు లేవు. ఈ సినిమా తర్వాత నేను డైరెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ లో నా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ సినిమా కామెడీ జానర్ లో ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే నేనే రాసాను. యాక్టర్స్ కూడా ఫైనల్ అయిపోయారు. త్వరలో షూటింగ్ మొదలుపెడతాము అని తెలిపాడు. దీంతో ఇన్నాళ్లు తన కామెడీతో నవ్వించిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు దర్శకుడిగా మారి నవ్వించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
