Rajamouli : బ్రెజిల్లో రాజమౌళి.. వారణాసి అప్డేట్.. అక్కడ కూడా రిలీజ్ చేస్తామంటూ..
రాజమౌళి వారణాసి కథేంటో రివీల్ చేసి అప్డేట్ ఇచ్చారు. (Rajamouli)
Rajamouli
Rajamouli : బ్రెజిల్ టూర్ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి వారణాసి కథేంటో రివీల్ చేసి అప్డేట్ ఇచ్చారు. వారణాసి షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే కంప్లీటయ్యే అవకాశం ఉందన్న జక్కన్న.. సినిమా చూస్తే ఆరేడు డిఫరెంట్ సినిమాలను చూసిన ఫీలింగ్ ఉంటుదన్నారు. ఈ కథని మలచడమే వారణాసి సినిమా విషయంలో అతిపెద్ద చాలెంజ్ అని వివరించారు. బలమైన తండ్రీకొడుకుల ఎమోషన్ చుట్టూ వారణాసి కథ తిరుగుతుందని చెప్పేశారు దర్శకధీరుడు రాజమౌళి.
మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రామాయణం ఎపిసోడ్ హైలైట్‌గా తెరకెక్కుతోన్న వారణాసిలో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ కూడా ఉందని.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. అందరూ అనుకుంటున్నట్లు.. వారణాసి సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని, రామాయణ నేపథ్యంతో ముడిపడి ఉన్న అద్భుతమైన మైథలాజికల్ ఫాంటసీ విజువల్ వండర్ వారణాసి అని క్లారిటీ ఇచ్చారు జక్కన్న. అంతేకాదు రుద్రగా మహేశ్‌బాబు యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీ రాముడిగా కనిపించే ఎపిసోడ్.. అభిమానులకే కాదు.. ఆడియెన్స్‌కి సైతం గూస్బంప్స్ లోడ్ చేస్తుందని అంచనాల్ని పీక్స్‌కి పెంచేశారు జక్కన్న.
Also Read : Nayanthara : కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. ఏకంగా 60 అడుగులు.. అమ్మవారి గెటప్‌లో నయనతార..
బ్రెజిల్లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రస్టేజియస్ అవార్డ్ తీసుకున్న రాజమౌళి.. వారణాసికి సంబంధించి ఈ క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. అంతేకాదు వారణాసి సినిమాని కచ్చితంగా బ్రెజిల్లో కూడా రిలీజ్ చేస్తామని క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో వారాణసి సినిమాని అనుకున్నట్టే ఎక్కువ దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో రుద్రతో పాటు శ్రీరాముడిగా మహేష్ బాబు నటిస్తున్నారు. అలాగే మందాకినిగా ఫీమేల్ లీడ్ రోల్లో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో నెగిటివ్ షేడ్స్ తో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వారణాసి గురించి అన్నీ చెప్పిన రాజమౌళి రిలీజ్ డేట్ ఏప్రిల్ 7 అని చెప్పకుండా హోప్ ఫుల్లీ వెరీ సూన్ అనడంతో సినిమా వాయిదా పడుతుందా అనే చర్చ జరుగుతుంది.
