2K Lovers : ‘2కె లవర్స్’ కొత్త సినిమా ఓపెనింగ్.. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో కొత్త ప్రేమకథ..

నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా..(2K Lovers)

  • Published on- August 16, 2026 / 06:10 PM IST

2K Lovers

2K Lovers : ఎంబి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై బిచ్చు నాయక్ నిర్మాణంలో రాజేష్ నాయుడు దర్శకత్వలో తెరకెక్కుతున్న సినిమా ‘2కె లవర్స్’. సోల్ అఫ్ లవ్ అనేది ట్యాగ్ లైన్. మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ, తనికెళ్ల భరణి, వీఎన్ ఆదిత్య గెస్టులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి స్క్రిప్ట్ అందజేశారు.

Also See : Vangalapudi Anitha : బ్రహ్మానందంను కలిసిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. ఫొటోలు..

అనంతరం దర్శకుడు రాజేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ ఇది. ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. నిర్మాత బిచ్చు నాయక్ మాట్లాడుతూ.. రసూల్ ఈ సినిమాకు మంచి కథను అందించారు. తెలంగాణ యాసలో ఇది వరకు చూడని ప్రేమ కథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా ఉండబోతోంది అని తెలిపారు.

రచయిత రసూల్ మాట్లాడుతూ.. మేం తీయబోతోన్న ఈ ప్రేమ కథను అందరూ ఆదరిస్తారు. ఇందులోని కథ అందరినీ వెంటాడుతుంది. మా సినిమాలో ప్రేమ, రోదన, ఆవేదన, బంధాలు, అనుబంధాలు, హాస్యం.. అన్ని ఎమోషన్స్ ఉంటాయి అని అన్నారు. హీరో మోహిత్ మాట్లాడుతూ.. ఇదొక కొత్త ప్రేమ కథ. రెగ్యులర్ సినిమాల్లా మాత్రం ఉండదు అని అన్నారు.