Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్‌లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
షారుఖ్ ఖాన్.. బహుశా సినిమా చూసేవారికి ఈ పేరుతో కొత్త పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్.....

30 Years Of Shah Rukh Khans Greatest Dialogues
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్.. బహుశా సినిమా చూసేవారికి ఈ పేరుతో కొత్త పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో బాలీవుడ్ బాద్షాగా మారాడు షారుఖ్ ఖాన్. ఇక షారుఖ్ ఖాన్ సినిమా రంగంలో అడుగుపెట్టి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, బాలీవుడ్ స్టార్స్, లెజెండరీ యాక్టర్స్ అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Shah Rukh Khan: జవాన్ టైటిల్ వీడియో.. అదరగొట్టిన షారుఖ్!
అయితే షారుఖ్ ఖాన్ సినీ కెరీర్ కేవలం సక్సెస్‌లతోనే సాగిపోలేదు. ఆయన సినీ కెరీర్‌లో ఫ్లాపుల లిస్ట్ కూడా చాలా పెద్దదే. అయినా ఏమాత్రం వెనకాడకుండా.. ధైర్యాన్ని కోల్పోకుండా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, నేడు బాలీవుడ్ అంటే షారుఖ్ అనే స్థాయికి ఆయన చేరుకున్నాడు. ఇక షారుఖ్ ఖాన్ యాక్షన్ కంటే కూడా ఆయన డైలాగ్ డెలివరీ అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ‘డర్’ అనే సినిమాలో షారుఖ్ చెప్పిన ‘ఐ లవ్ యు క.క.క.కిరణ్’ అనే డైలాగ్ ఎవర్‌గ్రీన్ అని చెప్పాలి. ఇలా షారుఖ్ ఖాన్ కెరీర్‌లో కొన్ని ది బెస్ట్ డైలాగుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Shah Rukh Khan: హై ఎనర్జీతో యాక్టివ్‌గా మారిన షారుఖ్.. బాద్షా ఈజ్ బ్యాక్!
బాజీగర్(1993)లో షారుఖ్ చెప్పిన ‘‘హార్ కే జీత్నే వాలే కో బాజీగర్ కెహతే హే.. క్యా కెహతే హే..?’’ అంటూ హీరోయిన్‌ను భయపెడుతూ అడిగిన ప్రశ్న అప్పట్లో సూపర్ డైలాగ్‌గా నిలిచింది. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే(1995)లో షారుఖ్ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పటికీ ఇన్‌స్టా రీల్స్‌లో వినిపిస్తూ ఉంటుంది. ‘‘బడే బడే దేశోమే ఐసీ చోటీ చోటీ బాతే హోతీ రెహతీ హై’’ అని షారుఖ్ చెప్పిన విధానం సూపర్. ఇక దిల్ తో పాగల్ హై(1997) సినిమాలో షారుఖ్ తన బ్రాండ్ డైలాగ్ చెప్పి దేశవ్యాప్తంగా అమ్మాయిల మనసుల్ని దోచేశాడు. ‘‘రాహుల్.. నామ్ తో సునా హోగా…’’ ఈ డైలాగ్‌తో షారుఖ్ ప్రపంచాన్ని ఊపేశాడని చెప్పాలి.
కుచ్ కుచ్ హోతా హై(1998)లో ‘‘ప్యార్ దోస్తీ హై’’ అనే డైలాగ్ ఆనాటి కాలేజీ స్టూడెంట్స్‌లో ఓ ట్రెండ్ సెట్టర్. చాలా మంది ఈ డైలాగ్‌తోనే తమ ప్రేమను సక్సెస్ చేసుకున్నారు. చక్ దే ఇండియా (2007) సినిమాలో షారుఖ్ ఓ లెంగ్తీ డైలాగ్ చెబుతాడు. కానీ ఈ డైలాగ్ స్టార్టింగ్‌లో ‘‘యే సత్తర్ మినట్’’ అనే పదం మాత్రం చాలా వైరల్ అయ్యింది. ఈ ఒక్క పదంతో సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి.
ఇలా షారుఖ్ ఖాన్ తనదైన స్టయిల్‌లో నటనతో పాటు ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే విధంగా చెప్పిన డైలాగులు ఆయన్ను బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా మార్చాయని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటారు. ఇక ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ‘‘పఠాన్’’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు.