72nd National Awards: 72వ జాతీయ పురస్కారాలు.. బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే ‘సుకుమార్’.. సత్తా చాటిన ‘కమిటీ కుర్రాళ్లు’, డైరెక్టర్ ‘వెంకీ అంట్లూరి’

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర (72nd National Awards)పురస్కారాలను ప్రకటించింది.

72nd National Film Awards Winners Complete List Across All Categories

  • 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.
  • మమ్ముట్టి, కార్తీక్‌లకు ఉత్తమ నటుడు.
  • యామీ గౌతమికి ఉత్తమ నటి.

72nd National Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రకటించిన ఈ అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఉత్తమ జాతీయ చిత్రం’ అవార్డును బాలీవుడ్ మూవీ ‘ఆర్టికల్‌ 370’ కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి ఇద్దరు నటులు సంయుక్తంగా అవార్డు(72nd National Awards)ను అందుకున్నారు. మలయాళ స్టార్ మమ్ముట్టి ‘బ్రహ్మయుగం’, బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’. ఇక ఉత్తమ నటి విభాగంలో యామీ గౌతమి(‘ఆర్టికల్ 370’) జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

72nd National Awads: 72వ జాతీయ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్

జాతీయ పురస్కారాలు అందుకున్నవారి వివరాలు ఇలా ఉన్నాయి:

*ఉత్తమ జాతీయ చిత్రం – ఆర్టికల్‌ 370
*ఉత్తమ నటులు- మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్‌ ఆర్యన్‌ (చందు ఛాంపియన్‌)
*ఉత్తమ దర్శకుడు- రాజ్‌ కుమార్‌ పెరియస్వామి (అమరన్‌ )
*ఉత్తమ నటి (లీడింగ్‌ రోల్‌ )- యామీ గౌతమి (ఆర్టికల్‌ 370 )
*బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌- జలాల్‌ ( భ్రమయుగం )
*ఉత్తమ నేపథ్య గాయని- వైకోం విజయలక్ష్మి (ARM)
*ఉత్తమ ప్రజాదరణ చిత్రం- కల్కి 2898 AD
*ఉత్తమ తెలుగు చిత్రం- కమిటీ కుర్రాళ్లు
*ఉత్తమ కన్నడ చిత్రం- మిథ్య
*ఉత్తమ తమిళ చిత్రం- రాయన్‌
*ఉత్తమ హిందీ చిత్రం- శ్రీకాంత్‌
*ఉత్తమ గుజరాతీ చిత్రం- మారన్‌ ( ది హంట్‌ )
*ఉత్తమ మలయాళ చిత్రం- ఫెమినిస్ట్‌ ఫాతిమా
*ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌- జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ( అమరన్‌ )
*ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌- దీపాలి నూర్‌, శీతల్‌ శర్మ ( పుష్పు-2)
*ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైనర్‌- నితిన్‌ జిహానీ ( కల్కి 2898 AD )
*ఉత్తమ ఎడిటర్‌- కలైవన్నన్‌ ( అమరన్‌ )
*ఉత్తమ సౌండ్‌ డిజైనర్‌ – మానస్‌ చౌదరి ( భూల్‌ భులయ్యా )
*ఉత్తమ స్టంట్‌ – అరసు ( మహారాజా )
*ఉత్తమ సంగీతం- జీవీ ప్రకాశ్‌ కుమార్‌
*బెస్ట్‌ డైలాగ్‌ రైటర్‌- వెంకీ అట్లూరి ( లక్కీ భాస్కర్‌ )
*ఉత్తమ సంగీత దర్శకుడు -శశ్వంత్‌ సచ్‌ దేవ్‌ ( ఆర్టికల్‌ 370 )
ఉత్తమ మేకప్‌- రవి కుమార్‌ ( కమిటీ కుర్రోళ్లు )
బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే – సుకుమార్‌ ( పుష్ప-2 )