×
Ad

Mr Bachchan : మాస్ మహారాజ సినిమాలో యూత్ యువరాజ.. ఓ హీరో, ఓ మ్యూజిక్ డైరెక్టర్ గెస్ట్ అప్పీరెన్స్..

మిస్టర్ బచ్చన్ సినిమాలో ఇద్దరు స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

  • Published On : August 15, 2024 / 06:56 AM IST

A Hero and A Music Director gives Special Guest Appearance in Raviteja Mr Bachchan Movie

Mr Bachchan : ఇటీవల సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చి ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా సినిమాల్లో వేరే నటీనటుల్ని అతిథి పాత్రల్లో చూపిస్తూ సినిమాకి మరింత హైప్ పెంచుతున్నారు. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా ఓ యువ స్టార్ హీరో గెస్ట్ పాత్రలో అదరగొట్టాడు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. కానీ నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమా పై మిక్స్‌డ్ టాక్ వస్తుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. డీజే టిల్లు సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ సెకండ్ హాఫ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఓ ఫైట్ చేసి కొన్ని డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఆ మాస్ మహారాజ కోసం ఈ యూత్ యువరాజ్ వచ్చాడు అనే డైలాగ్ థియేటర్స్ లో బాగా పేలింది.

Also Read : Vedaa : ‘వేద’ మూవీ రివ్యూ.. బాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే..?

సినిమా రిలీజ్ కి ముందే సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడని వైరల్ అయింది. ఇప్పుడు సినిమాలో సిద్ధు ని చూసి ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే సిద్ధుకి – రవితేజకి కలిపి ఒక సీన్ ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలోని ఓ సాంగ్ లో దేవిశ్రీ ప్రసాద్ అలా కనిపించి ఇలా మాయమయ్యే సరదా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మిక్కీ జె మేయర్ సంగీతం ఇచ్చిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం.