×
Ad

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై అసభ్య‌క‌ర‌మైన పోస్ట్‌ చేసిన యువకుడు అరెస్ట్

ఓ నెటిజ‌న్ మాత్రం పునీత్ రాజ్‌ కుమార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టాడు. ఈ క్ర‌మంలో ఆ యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు.

  • Published On : November 4, 2021 / 07:38 AM IST

Puneeth (1)

Puneeth Rajkumar :  క‌న్న‌డ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో ఆయన అభిమానులే కాక కన్నడ ప్రజలు, దేశ వ్యాప్తంగా కూడా ప్ర‌తి ఒక్క‌రు శోక సంద్రంలో మునిగిపోయారు. కేవలం సినీ హీరోగానే కాక ఎన్నో సేవ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు పునీత్. సినీ హీరోగా కాక ఓ వ్యక్తిగా ఆయనని దూషించే వారు లేరు. అయితే ఓ నెటిజ‌న్ మాత్రం పునీత్ రాజ్‌ కుమార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టాడు. ఈ క్ర‌మంలో ఆ యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు.

Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

పునీత్ మృతి నేపథ్యంలో కర్ణాటక అంతా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అందులో భాగంగా మూడు రోజులు మద్యం విక్రయాలను నిషేధించారు. దీనిపై ఓ వ్యక్తి బీర్ బీటిల్ చేతిలో ప‌ట్టుకొని రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర…. అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ కి బెంగళూరు నగర పోలీసులను ట్యాగ్ చేయడం గమనార్హం. దీంతో బెంగుళూరు పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ… ఒక యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. సైబర్ టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది అని తెలిపారు. ఆ పోస్ట్ ని సైబర్ టీం తొలిగించినట్లు తెలుస్తుంది.