×
Ad

Vijay-Rashmika: ప్రేమ వీళ్లదే.. కానీ, కారణం మాత్రం ఆ దర్శకుడేనట.. ఇంతకీ ఆ సంగతేంటో!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ-నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంగేజ్ మెంట్ చేసుకున్న (Vijay-Rashmika)విషయం తెలిసిందే. అసలు ఎలాంటి హడావుడి లేకుండా చాలా గోప్యంగా ఈ తంతు జరిగింది.

A star director is the The reason behind Vijay Deverakonda and Rashmika Mandanna's love

Vijay-Rashmika: రౌడీ హీరో విజయ్ దేవరకొండ-నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఎలాంటి హడావుడి లేకుండా చాలా గోప్యంగా ఈ తంతు జరిగింది. దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్ళికి సిద్ధం అవుతున్నారు దీంతో, ఈ ఇద్దరి స్టార్స్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (Vijay-Rashmika)ఇక పెళ్లి విషయానికి వస్తే 2026 ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెళ్లి కూడా చాలా సింపుల్ గా సంప్రదాయబద్దంగా జరుగనుందని టాక్.

Rakshith Shetty: ఆనందంలో రష్మిక మాజీ ప్రియుడు.. థాంక్స్ చెప్తూ పోస్ట్.. రష్మికను ట్యాగ్ చేస్తున్న ఫ్యాన్స్

ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమ, పెళ్లి గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే? విజయ్,రష్మిక మొదటిసారి కలిసి నటించిన సినిమా గీత గోవిందం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజుల్లో విజయ్, రష్మిక అసలు మాట్లాడుకునేవారు కాదట. జస్ట్ షూట్ చేయడం వెళ్లి వారి కారవ్యాన్ లో కూర్చోవడం చేసేవారట. ఇది గమనించిన దర్శకుడు ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరగడానికి కొన్ని డైలాగ్స్ రాసి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించేవాడట. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడటానికి ఆ డైలాగ్స్ చాలా హెల్ప్ అయ్యాయట. అలా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలో పడటానికి దర్శకుడు పరుశురాం తెలియకుండానే కారణం అయ్యాడట. దీంతో, దర్శకుడు పరశురామ్ కి విజయ్, రష్మిక ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెప్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన అనే మాస్ సినిమా చేస్తున్నారు. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.