Rakshith Shetty: ఆనందంలో రష్మిక మాజీ ప్రియుడు.. థాంక్స్ చెప్తూ పోస్ట్.. రష్మికను ట్యాగ్ చేస్తున్న ఫ్యాన్స్

రష్మిక మందన్నా మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఫుల్ హ్యాపీ గా ఉన్నాడట(Rakshith Shetty). తన హ్యాపీనెస్ కి కారణమైన వారికి థాంక్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Rakshith Shetty: ఆనందంలో రష్మిక మాజీ ప్రియుడు.. థాంక్స్ చెప్తూ పోస్ట్.. రష్మికను ట్యాగ్ చేస్తున్న ఫ్యాన్స్

Rashmika gets engaged to Vijay Deverakonda while ex-boyfriend Rakshit Shetty receives awards

Updated On : October 5, 2025 / 11:09 AM IST

Rakshith Shetty: రష్మిక మందన్నా మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఫుల్ హ్యాపీ గా ఉన్నాడట.(Rakshith Shetty) తన హ్యాపీనెస్ కి కారణమైన వారికి థాంక్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే, ఆ పోస్ట్ దేనికోసమో కాదు.. ఆయన హీరోగా వచ్చిన చార్లీ 777 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సినిమా అవార్డులను ప్రకటించింది. చార్లీ 777 చిత్రానికి గాను రక్షిత్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. అలాగే ఈ అవార్డుల్లో చార్లీ 777 సినిమా ఏకంగా నాలుగు పురస్కారాలను అందుకుంది.

80’s Reunion: 80’స్ రీయూనియన్.. ఆడుతూపాడుతూ సందడిచేసిన తారలు.. ఫోటోలు వైరల్

ఇక ఈ అందాన్ని సోషల్ మీడియా వేదికంగా ఆడియన్స్ తో పంచుకున్నాడు రక్షిత్ శెట్టి. “చార్లీ 777 సినిమాకు 4 అవార్డులు రావడంతో మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్, ప్రతీక్ అద్భుతమైన ఎడిటింగ్, నాగార్జున మాటలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఈ సందర్బంగా జ్యూరీకి, ప్రేక్షకులకు, చిత్రయూనిట్‌కు నా ధన్యవాదాలు”. దీంతో రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలాగే, కామెంట్స్ లో రష్మిక పేరును కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఓపక్క రష్మిక విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సందర్భంలో తమ హీరోకి ఇలాంటి గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దానికి కారణం రక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా గతంలో ప్రేమికులు కావడమే. కిరిక్ పార్టీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట ప్రేమలో పడి వివాహం వరకు వెళ్లారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధము కూడా చేసుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక అప్పటినుంచి ఎవరిదారిలో వారు సినిమాలు చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఇంతకాలానికి రష్మిక విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, రక్షిత్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ రశ్మికను ట్యాగ్ చేస్తున్నారు.