Chidambaram S. Poduval
Chidambaram S. Poduval : 2024లో మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో భారీ విజయం సాధించాడు దర్శకుడు చిదంబరం పొడువల్. ఇది చిదంబరంకు రెండో సినిమా. మళయాళంతో పాటు అన్ని సినీ పరిశ్రమలలో మంజుమ్మల్ బాయ్స్ సినిమా హిట్ అయింది.
తాజాగా ఈ సినిమా దర్శకుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. కేరళలోని ఎర్నాకుళం టౌన్ సౌత్ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఓ మలయాళ నటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు.
Also Read : Renu Desai : మొన్న వార్నింగ్.. నేడు కంప్లైంట్.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన రేణు దేశాయ్..
ఆ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2022లో కొచ్చి నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్ తనతో లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. దీంతో చిదంబరంపై BNS సెక్షన్ 74, 75 (లైంగిక వేధింపుల నేరాలు) కింద కేసు నమోదు చేసారు పోలీసులు.