Aadarsha Kutumbam : ఎప్పుడో పెళ్ల‌ప్పుడు న‌వ్వింది.. మ‌ళ్లీ న‌వ్వ‌లేదు.. ఆక‌ట్టుకుంటున్న ఆద‌ర్శ‌కుటుంబం వీడియో..

విక్టరీ వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ఆద‌ర్శ‌కుటుంబం (Aadarsha Kutumbam).

Aadarsha Kutumbam AK47 Introducing SrinidhiShetty as Swarna

Aadarsha Kutumbam : విక్టరీ వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ఆద‌ర్శ‌కుటుంబం. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌. అక్టోబ‌ర్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్రంలో ప్ర‌ధాన న‌టీన‌టుల పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తోంది.

ఇటీవ‌ల వెంక‌టేష్ పాత్ర చిట్టిబాబును ప‌రిచ‌యం చేయ‌గా.. తాజాగా శ్రీనిధి పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది. ఈ చిత్రంలో శ్రీనిధి స్వ‌ర్ణ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ ఆడాళ్లకి Attitude తప్ప Gratitude ఉండదు, ఎప్పుడో పెళ్ల‌ప్పుడు న‌వ్వింది.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు న‌వ్వ‌లేదు అంటూ చిట్టిబాబుగా వెంకీ చెప్పే డైలాగ్స్ న‌వ్వులు పూయిస్తున్నాయి.

Raashii Khanna : అందాల‌తో మ‌తి పోగొడుతున్న రాశి ఖ‌న్నా.. బ్లాక్ డ్రెస్‌లో స్ట‌న్నింగ్ ఫోటోలు..

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.