Aadarsha Kutumbam : ఆదర్శకుటుంబం.. చిట్టిబాబుగా వెంకటేష్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదర్శకుటుంబం (Aadarsha Kutumbam).
- Thota Vamshi Kumar
- Updated on- July 27, 2026 / 01:16 PM IST
Aadarsha Kutumbam AK47 Introducing Venkatesh as Chittibabu
Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదర్శకుటుంబం. హౌస్ నెంబర్ 47 అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ తాజాగా చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది.
ఈ చిత్రంలో వెంకటేష్.. చిట్టిబాబుగా కనిపించనున్నాడు. “కిచెన్‌లో ఏసీనా.. నాన్న నువ్వు వంట చేసుకునేటప్పుడు హ్యాపీ ఏసీ వేసుకుని చేసుకోవచ్చు. వాషింగ్ మెషెన్ కూడా ఉంది. నీకు బాగా పని తగ్గిపోయినట్టే..” అని శ్రీనిధి అనగా.. “అస్తమానం తలతిప్పకండి బోజీగారు మెడపట్టేస్తుంది. నాకు ఎవరేం పని చేసినా నచ్చదు. అందుకే అన్ని పనులు నేనే చూసుకుంటాను.. అర్థమైందా?” అని వెంకీ చెప్పే డైలాగ్‌లు నవ్వులు పూయిస్తోంది.
సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే పాత్రతో రాబోతున్నారు. చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన పాత్రగా నిలిచేలా కనిపిస్తోంది. ఆనందం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ పాత్ర ఉండబోతోంది.
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
