Aadarsha Kutumbam : ఆద‌ర్శ‌కుటుంబం నుంచి మ‌రో వీడియో.. చిట్టిబాబు చిట్టిత‌ల్లి..

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న ఆదర్శ కుటుంబం నుంచి మ‌రో వీడియో వ‌చ్చేసింది

Aadarsha Kutumbam AK47 Introducing YuvinaParthavi as Sampoorna

Aadarsha Kutumbam : విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. హౌస్ నెం 47 అనేది ట్యాగ్‌లైన్‌. శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌చారంలో భాగంగా ఈ మూవీలోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వారి పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తోంది చిత్ర‌బృందం.

వెంకటేష్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా ప‌రిచ‌యం చేయ‌గా అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. తాజాగా చిట్టిబాబు కుటుంబంలోని మరో సభ్యురాలిని పరిచయం చేసింది. చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది.

Pooja Hegde : బుడాపెస్ట్‌లో బుట్టబొమ్మ‌.. పూజా హెగ్డే క్యూట్ ఫోటోలు వైర‌ల్..

నాన్న నేనో అబ్బాయిని ప్రేమించేశా అని పార్థ‌వి చెప్పే డైలాగ్ బాగుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి. కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.