The Warrior : వారియర్ కి విలన్‌గా గురు.. మాన్స్టర్ అంటూ రామ్ ట్వీట్..
తాజాగా ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా 'ది వారియర్' సినిమా విలన్ ని అన్నౌన్స్ చేశారు. ఇందులో విలన్‌గా గురు పాత్రలో ఆది పినిశెట్టి నటించనున్నారు. ఇప్పటికే హీరోగా, విలన్‌గా............
- Saketh U
- Published on- March 1, 2022 / 05:44 PM IST
Warrior
Aadhi Pinisetty : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. రామ్ మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ సినిమా రూపొందుతుంది.
తాజాగా ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ‘ది వారియర్’ సినిమా విలన్ ని అన్నౌన్స్ చేశారు. ఇందులో విలన్‌గా గురు పాత్రలో ఆది పినిశెట్టి నటించనున్నారు. ఇప్పటికే హీరోగా, విలన్‌గా, ప్రత్యేక పాత్రలతో తెలుగు తమిళ్ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’ సినిమాలో ఆది పూర్తి విలన్‌గా కనిపించి మెప్పించాడు. తాజాగా ‘ది వారియర్’ సినిమాలో మరోసారి పూర్తి విలన్‌గా తన విలనిజం చూపించబోతున్నాడు.
Raviteja : ఆయుధంలా బతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువునా.. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్..
గురు క్యారెక్టర్లో ఆది పినిశెట్టి లుక్‌ని పోస్ట్ చేస్తూ రామ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో..”నువ్వు మాన్స్టర్ వి. నీ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడటానికి ఎదురు చూస్తున్నాను బ్రదర్.” అంటూ పోస్ట్ చేశాడు. ఆది పినిశెట్టి క్యారెక్టర్ గురించి డైరెక్టర్ లింగుస్వామి మాట్లాడుతూ.. ”విలన్‌గా ఆది పినిశెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తాడు. హీరో విలన్ల మధ్య సీన్స్ నువ్వా నేనా అన్నట్లు ఉంటాయి. గురు పాత్రకు ఆది పినిశెట్టి వంద శాతం యాప్ట్ అయ్యారు” అని తెలిపారు.
