Sabdham OTT: సరిగ్గా ఏడాదికి ఓటీటీకి వచ్చిన హారర్ మూవీ.. ‘శబ్దం’ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏడాది తరువాత ఓటీటీకి వచ్చేసిన అది పినిశెట్టి 'శబ్దం(Sabdham OTT)' మూవీ.
- V Santhosh Kumar
- Published On : March 24, 2026 / 08:01 PM IST
Aadhi pinisetty Sabdham movie now streaming on ZEE5.
Sabdham OTT: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా విడుదలైనా సాధారణంగా ఏ సూపర్ హిట్ సినిమా అయినా విడుదలైన నాలుగు వారాల్లోనో, లేదా ఓటీటీ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని నెలల్లోనో స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. కానీ, హీరో ఆది పినిశెట్టి నటించిన ఒక హారర్ చిత్రం మాత్రం ఏడాది తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘వైశాలి’ లాంటి సూపర్ హిట్ తర్వాత ఆది పినిశెట్టి – దర్శకుడు అరివళగన్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘శబ్దం(Sabdham OTT)’.
Prince Yawar: హనీట్రాప్ లో బిగ్ బాస్ ఫేమ్ యావర్.. రూ.23 లక్షలు గోవిందా!
హారర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా గతేడాది ఫిబ్రవరిలో విడుదల అయ్యింది. అయితే, విభిన్నమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను భయపెట్టడంలో సఫలమైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. మిశ్రమ స్పందన రావడంతో ఈ సినిమా త్వరగానే ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఏడాది కాలం పాటు ఓటీటీకి రాలేదు ఈ సినిమా.
ఏడాది తరువాత, ఇప్పుడు ‘జీ5’ (ZEE5)లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది ఈ సినిమా. అయితే, ఇక్కడే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇంకా ఆ సినిమాను ఓటీటీలో చూసే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఈ సినిమా కేవలం తమిళ భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
