Aadhi Pinishetty: హార్రర్ దెబ్బకు ‘శబ్దం’ చేస్తున్న ఆది పినిశెట్టి!
తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యాక్టర్ ఆది పినిశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రలు.. ఇలా అన్ని రకాల పాత్రలను చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈ యంగ్ యాక్టర్. అయితే తాజాగా నేడు ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకుంటుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు తమ విషెస్ తెలియజేస్తున్నారు.
- Anil Aaleti
- Published On : December 14, 2022 / 11:50 AM IST
Aadhi Pinishetty New Movie Titled Sabdham
Aadi Pinishetty: తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యాక్టర్ ఆది పినిశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రలు.. ఇలా అన్ని రకాల పాత్రలను చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈ యంగ్ యాక్టర్. అయితే తాజాగా నేడు ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకుంటుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు తమ విషెస్ తెలియజేస్తున్నారు.
కాగా, ఆది పినిశెట్టి తన నెక్ట్స్ చిత్రాన్ని ఈ సందర్భంగా అనౌన్స్ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు అరివజగన్‌తో కలిసి చేయబోతున్నట్లు ఆది పినిశెట్టి ప్రకటించాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వైశాలి’ అనే హార్రర్ మూవీ తెరకెక్కగా, అది తెలుగు-తమిళ భాషల్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి హార్రర్ కథాంశంతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు ఈ డైరెక్టర్ రెడీ అయ్యాడు.
అయితే, ఈ సినిమాకు ‘శబ్దం’ అనే టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించి, అంతే త్వరగా రిలీజ్ చేయాలని ఆది భావిస్తున్నాడు. మరి ‘శబ్దం’ సినిమాతో ఆది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తాడో చూడాలి.
