Si Yugandhar : రెండు రోజుల్లో సినిమా రిలీజ్.. హీరోనే పట్టించుకోవట్లేదు.. మొన్నే హిట్ కొట్టి ఇప్పుడేమో ఇలా..

సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ సినిమా రెండు రోజుల్లో రిలీజ్ ఉన్నా అసలు మూవీ యూనిట్ ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. (Si Yugandhar)

  • Published on- September 30, 2026 / 02:33 PM IST

Si Yugandhar

Si Yugandhar : చిన్న సినిమాలకే ఇటీవల ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక మిడ్ హీరోల సినిమాకు బాగానే ప్రమోట్ చేస్తున్నారు. అలాంటిది ఆది సాయి కుమార్ తన సినిమాని అసలు ప్రమోట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే శంబాలా సినిమాతో చాన్నాళ్లకు మంచి విజయం సాధించాడు ఆది సాయి కుమార్. దీంతో ఆది కెరీర్ గాడిలో పడింది అనుకున్నారు. తన నెక్స్ట్ సినిమా సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఓపెన్ అయినపుడు మంచి అంచనాలే నెలకొన్నాయి.

అయితే సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ సినిమా రెండు రోజుల్లో రిలీజ్ ఉన్నా అసలు మూవీ యూనిట్ ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. ఆది సాయి కుమార్ కానీ, హీరోయిన్ మేఘలేఖ కానీ, మూవీ యూనిట్ ఎవరూ కూడా ఈ సినిమా గురించి ఒక్క పోస్ట్ పెట్టలేదు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. కానీ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది.

Also Read : NTR : మూగ అభిమాని కోసం.. చేతికి ఉన్న పౌచ్ తీసేసి మరీ హగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..

ఇటీవలే డైరెక్ట్ గా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఇదేదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ బాగానే ఉంది కదా, ప్రమోషన్స్ చేస్తే జనాలు వస్తారు కదా అనే అభిప్రాయం టాలీవుడ్ లో నెలకొంది. దర్శక నిర్మాతలకు హీరో, హీరోయిన్స్ తో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? లేకా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా తెలియదు కానీ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ అనే ఒక సినిమా ఉన్నట్టు కూడా ప్రేక్షకులకు తెలియకుండానే అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. భారీ ప్రమోషన్స్ చేసినా సినిమాలని ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. మరి జీరో ప్రమోషన్స్ తో వచ్చే ఈ సినిమాని ఎవరైనా చూస్తారా చూడాలి. అసలు కెరీర్ గాడిలో పడినప్పుడు ఒక సినిమాని ఇలా వదిలేయడం తన కెరీర్ కే ఎఫెక్ట్ అవుతుంది అని ఆది గ్రహిస్తాడా చూడాలి మరి.