Aamir Khan : 61 ఏళ్ళ వయసులో సైలెంట్ గా మూడో పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్.. ఫొటో వైరల్..

తాజాగా నేడు ఆమిర్ ఖాన్ - గౌరి పెళ్లి చేసుకున్నారు. (Aamir Khan)

  • Published on- July 5, 2026 / 03:31 PM IST

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన సినిమాలతో పాటు తన రిలేషన్స్ తో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గత కొన్నాళ్లుగా ఆమిర్ ఖాన్ గౌరి అనే మహిళతో డేటింగ్ లో ఉన్నట్టు, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు, పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు ఆమిర్ ఖాన్ – గౌరి పెళ్లి చేసుకున్నారు.

నేడు ఉదయం ఆమిర్ ఖాన్ – గౌరి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సింపుల్ గా ఇంట్లోనే నిఖా చేసుకున్నారు. ఆమిర్ ఖాన్ గౌరి సంతకాలు చేసి ఒక్కటయ్యారు. వీరు సంతకాలు చేస్తున్న ఫొటో మీడియాకు రిలీజ్ చేయడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.

Also Read : Sanjjanaa Galrani : తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సంజన.. కొత్త సీరియల్ ఎప్పట్నించి? ఎందులో..?

ఆమిర్ ఖాన్ మొదట 1986లో నటి రీనా దత్తాని పెళ్లి చేసుకోగా ఈ జంట 2002 లో విడిపోయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావ్ ని 2005లో పెళ్లి చేసుకోగా వీళ్ళు 2021లో విడిపోయారు. ఇప్పుడు 2026లో గౌరిని పెళ్లి చేసుకున్నాడు ఆమిర్ ఖాన్.

గౌరి బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు. ఆమె తండ్రికి అనేక సెలూన్స్ ఉన్నట్టు సమాచారం. గౌరికి గతంలోనే పెళ్లయి విడాకులు తీసుకుంది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. బెంగుళూరులో ఓ ఈవెంట్లో ఈమె ఆమిర్ ఖాన్ కి పరిచయం అయి ఫ్రెండ్స్ గా మారి ఆ తర్వాత ఇలా ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుందని సమాచారం.