Aamir Khan : ఏడాదిన్నర పాటు సినిమాలో నటించను.. అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో ఏడాదిన్నర పాటు మొఖానికి రంగు పూసుకోనని తెగేసి చెప్పేశాడు. అమీర్ చివరిగా ప్రేక్షకులు ముందుకు 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో వచ్చాడు. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 10 ఏళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడినా.. సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కాగా...
- gum 95921
- Published On : November 18, 2022 / 10:20 AM IST
Aamir Khan's sensational decision of not acting in a film for one and a half years
Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో ఏడాదిన్నర పాటు మొఖానికి రంగు పూసుకోనని తెగేసి చెప్పేశాడు. అమీర్ చివరిగా ప్రేక్షకులు ముందుకు ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో వచ్చాడు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 10 ఏళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడినా.. సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
Aamir Khan: అమీర్ ఖాన్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రిలో అమీర్!
కాగా గత కొన్ని రోజులుగా అమీర్ ప్రతి మీడియా సమావేశంలో ఒకటే చెప్పుకుంటూ వస్తున్నాడు. “35 ఏళ్లగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్నా, దాని వల్ల నేను నా తల్లితో మరియు కుటుంబంతో తగినంత సమయం గడపక లేకపోతున్నా. నేను ఇప్పుడు చాలా పశ్చాత్తాపం పడుతున్న” అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అమీర్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో.. వచ్చే ఏడాదిన్నర పాటు సినిమాలో నటించను అని వెల్లడించాడు.
“నిజానికి లాల్ సింగ్ చద్దా సినిమా తరువాత ఛాంపియన్స్ అనే సినిమా తియ్యాల్సి ఉంది. అది మంచి స్క్రిప్ట్ కానీ నేను ఆ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. నా పిల్లలు ఎదుగుతున్నప్పుడు నేను వాళ్ళ పక్కన లేను. ఇప్పుడు నేను వాళ్లతో కొంత సమయం గడిపి ఆ ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే అమీర్ అమ్మ గారు అనారోగ్యంతో హాస్పిటల్ జాయిన్ అయ్యిన విషయం తెలిసిందే.
