×
Ad

Aashiqui 3: బాలీవుడ్‌ క్లాసిక్‌ లవ్‌ మూవీకి మరో సీక్వెల్.. ఆషికీ 3.. ఈ సారి కార్తీక్ ఆర్యన్ తో..

 బాలీవుడ్‌ క్లాసిక్‌ లవ్‌ మూవీస్‌లో ‘ఆషికీ’ ఒకటి. 1990లో అనూ అగర్వాల్‌, రాహుల్‌ రాయ్‌ జంటగా మహేష్ భట్ దర్శకత్వంలో ఆషికీ సినిమా విడుదలయి మంచి విజయం సాధించింది. బాలీవుడ్ ప్రేమ చిత్రాల్లో బెస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత...........

  • Published On : September 6, 2022 / 08:38 AM IST

Aashiqui movie gets another sequel this time with kartik aryan

Aashiqui 3:  బాలీవుడ్‌ క్లాసిక్‌ లవ్‌ మూవీస్‌లో ‘ఆషికీ’ ఒకటి. 1990లో అనూ అగర్వాల్‌, రాహుల్‌ రాయ్‌ జంటగా మహేష్ భట్ దర్శకత్వంలో ఆషికీ సినిమా విడుదలయి మంచి విజయం సాధించింది. బాలీవుడ్ ప్రేమ చిత్రాల్లో బెస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత 2013లో ఈ సినిమాకి సీక్వెల్ గా ఆషికీ 2 వచ్చింది. ఆదిత్య రాయ్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా ‘ఆషికీ 2’ సినిమా విడుదలవ్వగా ఇది కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా పాటలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచిపోయాయి.

ఇప్పుడు ఈ సినిమాకి మరో సీక్వెల్ ని ప్రకటించారు. ఇటీవలే ‘భూల్‌ భులయ్యా 2’ సినిమాతో బాలీవుడ్ లో హిట్ కొట్టిన యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా ఆషికీ3 సినిమాని ప్రకటించారు. టీ సిరీస్‌, విశేష్‌ ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. హీరోయిన్ ని ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్తుందంటూ చిత్ర యూనిట్ ప్రకటించారు.

Singer Smitha : ఆఫర్ వచ్చినా వెళ్ళను.. అదంతా టీఆర్పీ కోసమే.. బిగ్‌బాస్‌ పై ప్రముఖ సింగర్ సంచలన వ్యాఖ్యలు..

హీరో కార్తీక్ ఆర్యన్ చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లో మంచి క్రేజ్, ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో కార్తీక్ ఆర్యన్ తో ఆల్ టైం క్లాసిక్ సినిమా ఆషికీ సీక్వెల్ ప్రకటించడంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రకటనపై ఆషికీ సినిమా దర్శకుడు మహేష్ భట్ స్పందిస్తూ.. ఆషికీ సినిమా ఫ్రాంచైజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి నిర్మాతలుగా మీరే కరెక్ట్. ఈ టీం అందరికి అల్ ది బెస్ట్ అని తెలిపారు.