Arjun Sarja : ‘ఖిలాడి’ లో ‘అర్జున్ భరద్వాజ్’ గా ‘యాక్షన్ కింగ్’
మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడి’ లో పవర్‌ఫుల్ స్పెషల్ ఆఫీసర్‌గా ‘యాక్షన్ కింగ్’ అర్జున్..
- sekhar
- Published On : January 29, 2022 / 07:02 PM IST
Arjun Sarja
Arjun Sarja: గతేడాది సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ వరసు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘రాక్షసుడు’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మతో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నారు.. ‘వీర’ తర్వాత వీరి కలయికలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.
Full Kick Song: మాస్ మహారాజా మాస్ సాంగ్.. ఊపు ఊపుతుందిగా..
రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. సీనియర్ నటుడు, ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘ఖిలాడి’ కథ, అందులో తన క్యారెక్టర్ వినగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అర్జున్. శనివారం ఆయన పాత్రకు సంబంధిచిన అనౌన్స్‌మెంట్ ఇచ్చారు టీం.
Negative : సెలబ్రిటీలు, నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘నెగెటివ్’..
‘యాక్షన్ కింగ్’ అర్జున్ భరద్వాజ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. A Powerful Officer with Cool Attitude అనే క్యాప్షన్‌తో అర్జున్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని తెలిపారు. అలాగే రవితేజ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఫుల్ కిక్కు’ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 11న రవితేజ ‘ఖిలాడి’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Naga Chaitanya : మూడు సీజన్ల సిరీస్.. క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారుగా..
