Aadhi-Nikki: ఆది పినిశెట్టి పెళ్లి.. సంప్రదాయబద్దంగా నిశ్చతార్ధం!
సౌత్ సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు, తమిళ-తెలుగు సినిమాల నటుడు ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తెలుగులో గుండెల్లో గోదారి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆది..
- Naresh Mannam
- Published On : March 26, 2022 / 07:54 PM IST
Aadhi Nikki
Aadhi-Nikki: సౌత్ సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు, తమిళ-తెలుగు సినిమాల నటుడు ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తెలుగులో గుండెల్లో గోదారి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆది.. ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘రంగస్థలం’, ‘నీవెవరో’’,’ యూ టర్న్’, ‘గుడ్ లక్ సఖి’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా బిజీగా ఉండగానే తోటి నటి, తనతో నటించిన హీరోయిన్ ను పెళ్లాడేందుకు సిద్దమయ్యాడు. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడనున్నాడు.
Aadhi Nikki1
Aadhi-Nikki: హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి.. రహస్యంగా నిశ్చతార్ధం ఏర్పాట్లు!
ఈ విషయాన్ని ఆదినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలపగా.. మార్చి 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్దంగా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. ఆది హీరోయిన్ నిక్కీ గల్రానితో ప్రేమలో ఉన్నాడని తమిళ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. మరకతమణి సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించగా.. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
Aadhi Nikki2
The Warriorr: యాక్షన్ సినిమానే కానీ హీరో మతి మరుపు పోలీస్?
అప్పటి నుండి పలుమార్లు కెమెరాల కంట పడడంతో పాటు అప్పట్లో ఆది తండ్రి, దర్శకుడు రవిరాజా పుట్టినరోజు వేడుకలలో కూడా కుటుంబ సభ్యులతో నిక్కీ కలిసి కనిపించడంతో ఈ జంట పెళ్లిపై కథనాలు మొదలయ్యాయి. ఈ మధ్య రహస్య నిశ్చతార్ధ ఏర్పాట్లపై కూడా వార్తలు రాగా ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఆది ప్రకటించాడు. మొత్తంగా 39 ఏళ్ల ఆది.. 30 ఏళ్ళ నిక్కీ గల్రానితో త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నాడు. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా నటించిన సంజనా గల్రాని చెల్లెలే నిక్కీ గల్రాని కాగా సంజనా ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ చెల్లి మాత్రం పెళ్లి పీటలెక్కబోతుంది.
Aadhi Nikki3
