GV Narayana Rao : చిరంజీవి, రజినీకాంత్ క్లోజ్ ఫ్రెండ్.. సీనియర్ నటుడు కన్నమూత..

జీవీ నారాయణ రావు రజినీకాంత్, చిరంజీవిలకు క్లోజ్ ఫ్రెండ్.(GV Narayana Rao)

  • Published on- August 27, 2026 / 07:49 AM IST

GV Narayana Rao

GV Narayana Rao : సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు అనారోగ్యంతో నిన్న(ఆగస్టు 26) రాత్రి కన్నుమూశారు. 73 ఏళ్ళ వయసులో పలు అనారోగ్య సమస్యలతో, వయోభారంతో బాధపడుతూ మరణించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

జీవీ నారాయణ రావు రజినీకాంత్, చిరంజీవిలకు క్లోజ్ ఫ్రెండ్. 1953లో జన్మించిన జీవీ నారాయణ రావు ఆయన తండ్రి డిస్ట్రిబ్యూటర్, సారథీ స్టుడియో మేనేజింగ్ డైరెక్టర్‌ కావడంతో చిన్నప్పటి నుంచే సినిమాలు, నాటకాలపై ఆసక్తి నెలకొంది. నాటకాలతో మొదలుపెట్టి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ కి జాయిన్ అయ్యారు. అక్కడే రజినీకాంత్, చిరంజీవి, కమెడియన్ సుధాకర్.. ఇలా వీళ్లంతా కలిసి ఉండేవాళ్ళు.

Also Read : NTR – Yash : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కంటే ముందే.. ‘టాక్సిక్‌’లో దాని గురించి చెప్పేసిన యశ్..

1976లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అంతులేనికథ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఆ సినిమాలో రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మొదటి సినిమాకే ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు జీవీ నారాయణ రావు. అనంతరం హీరోగా ఒక ఊరి కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ.. సినిమాల్లో నటించారు. కానీ అవి ఆశించినంత విజయం సాధించకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అనేక సినిమాలో నటించారు.

మధ్యలో నిర్మాతగా మారి మెగాస్టార్ చిరంజీవి తో దేవాంతకుడు, యముడికి మొగుడు సినిమాలని తీసి హిట్ కొట్టారు. యముడికి మొగుడు సినిమాని తమిళ్ లో రజినీకాంత్ తో రీమేక్ చేసారు. దాదాపు 100 సినిమాల్లో నటించి పది సినిమాల వరకు నిర్మించారు. కెరీర్ చివరి దశలో సీరియల్స్ లో కూడా నటించారు.