ఫోన్ చేస్తే సాయం.. వారికి అండగా రాజశేఖర్, జీవిత దంపతులు

  • Publish Date - March 23, 2020 / 07:41 AM IST

కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బతో ప్రపంచం అల్లాడిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలో విస్తరించిన ఈ మహమ్మారి, దేశంలో, రాష్ట్రాల్లో కూడా రోజురోజుకి విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా షట్ డౌన్ అయ్యింది. ఈ క్రమంలో పేద కళాకారుల కోసం రాజశేఖర్, జీవితా దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయగా.. రోజువారి షూటింగ్‌లకు వెళ్లే కానీ, తినలేని పరిస్థితిలో ఉన్న కళాకారుల కొసం పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అందించనున్నట్లు హీరో డా.రాజశేఖర్‌, జీవితా రాజశేఖర్‌ ప్రకటించారు. 

రెక్కాడితే గాని డొక్కాడని నటీ నటులు 9010810140 నంబర్‌లో నవీన్ వర్మకు తమ పూర్తి వివరాలు అందిస్తే వారు తగు సహాయం పొందగలరు అంటూ వారు ప్రకటించారు.