Ram Pothineni : రామ్ పోతినేని మెడకు గాయం

‘ఉస్తాద్’ రామ్ మెడకు గాయమవడంతో లింగు స్వామి సినిమా షూటింగ్ నిలిచిపోయింది..

Ram Pothineni : రామ్ పోతినేని మెడకు గాయం

Ram Pothineni

Updated On : October 4, 2021 / 12:28 PM IST

Ram Pothineni: సినిమా వాళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవలే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇప్పడు ‘ఎనర్జిటిక్’ స్టార్, ‘ఉస్తాద్’ రామ్ పోతినేని మెడకు గాయం అయ్యింది.

ఈరోజు ఉదయం ఇంట్లోని జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రామ్ మెడకు గాయం అయ్యింది. దీంతో రామ్ నటిస్తున్న సినిమా షూటింగ్ నిలిచిపోయింది. రామ్ – లింగుస్వామి దర్శకత్వంలో తన 19వ సినిమా చేస్తున్నాడు.

‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. యంగ్ హీరో ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ‘యూటర్న్’, ‘సీటీమార్’ సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీకి ప్రొడ్యూసర్.