Sushanth : ‘రావణాసుర’ లో ‘రామ్’ గా..
రవితేజ ‘రావణాసుర’ మూవీలో ‘రామ్’ క్యారెక్టర్లో కనిపించనున్న యంగ్ హీరో సుశాంత్..
- sekhar
- Published on- January 11, 2022 / 06:27 PM IST
Sushanth
Sushanth: మాస్ మహారాజా రవితేజ గతేడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌కి కొత్త శుభారంభాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
Bangarraju Trailer : అక్కినేని తండ్రీకొడుకులు అదరగొట్టారుగా!
రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలతో పాటుగా సుధీర్ వర్మతో ‘రావణాసుర’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు.
Rajashekar : రియల్ తండ్రి కూతుళ్లు.. రీల్లో కూడా
రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా, చెన్నై పొన్ను ప్రియాంక అరుల్ మోహన్ ఇద్దరినీ హీరోయిన్లుగా కన్ఫమ్ చేశారని టాక్.
Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!
ఇప్పుడు యంగ్ హీరో సుశాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘అడ్డా’, ‘కరెంట్’, ‘చిలసౌ’ వంటి సినిమాలతో హీరోగా అలరించిన సుశాంత్.. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అల..వైకుంఠపురములో’.. మంచి క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నాడు.
రవితేజ ‘రావణాసుర’ లో ‘రామ్’ అనే క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఈ మేరకు మేకర్స్ సుశాంత్ లుక్ రిలీజ్ చేశారు. పొడవాటి జుట్టు, గెడ్డంతో సరికొత్త గెటప్‌లో సుశాంత్ లుక్ ఆకట్టుకుంటోంది. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు డైలాగ్స్ అందిస్తున్నారు.
