Rajashekar : రియల్ తండ్రి కూతుళ్లు.. రీల్‌లో కూడా

తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రాజశేఖర్ తో పాటు ఆయన కూతురు శివాని రాజశేఖర్ కూడా ఉంది. సినిమాలో కూడా రాజశేఖర్ కుమార్తె పాత్రలోనే శివాని......

Rajashekar : రియల్ తండ్రి కూతుళ్లు.. రీల్‌లో కూడా

Rajashekar :   యాంగ్రీ హీరో రాజశేఖర్ నుంచి 91వ సినిమాగా ‘శేఖర్’ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాకి రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రాజశేఖర్ తో పాటు ఆయన కూతురు శివాని రాజశేఖర్ కూడా ఉంది. సినిమాలో కూడా రాజశేఖర్ కుమార్తె పాత్రలోనే శివాని నటించింది. ఇప్పటికే హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన శివానికి మంచి పేరే వచ్చింది. తాజాగా ఈ సినిమాలో తండ్రితో కలిసి కనిపించబోతుంది.

Bhavana : ఐదేళ్లు అయింది.. అయినా పోరాడతాను.. లైంగిక వేధింపుల కేసుపై హీరోయిన్ భావన

‘శేఖర్’ సినిమా దర్శకురాలు, రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ….. “రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.