Bhavana : ఐదేళ్లు అయింది.. అయినా పోరాడతాను.. లైంగిక వేధింపుల కేసుపై హీరోయిన్ భావన

హీరోయిన్‌ భావనపై జరిగిన లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ స్టార్‌ హీరో దిలీప్‌ కుమార్‌పై కేరళ పోలీసులు ఇటీవల నాన్‌ బెయిలబుల్‌....

Bhavana : ఐదేళ్లు అయింది.. అయినా పోరాడతాను.. లైంగిక వేధింపుల కేసుపై హీరోయిన్ భావన

Bhavana

 

Bhavana :   హీరోయిన్‌ భావనపై జరిగిన లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ స్టార్‌ హీరో దిలీప్‌ కుమార్‌పై కేరళ పోలీసులు ఇటీవల నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్‌ భావనను కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్‌ కుమార్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్‌ ఈ కేసుకు సంబంధించిన అధికారులని భయపెట్టడంతో అతని సోదరుడు అనూప్‌, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు.

Unstoppable with NBK : ‘సమరసింహా రెడ్డి’ వెల్‌కమ్స్‌ ‘అర్జున్‌ రెడ్డి’

తాజాగా ఈ ఘటనపై హీరోయిన్‌ భావన స్పందించింది. తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని సోషల్‌ మీడియాలో ఓ పోస్టును షేర్‌ చేసింది. భావన తన సోషల్ మీడియాలో.. ”బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్ధతుగా నిలిబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేసింది.