Ashu Reddy: రూ.9 కోట్ల మోసం.. స్పందించిన అషు రెడ్డి.. తప్పుడు వార్తలు రాస్తే జైలుకే అంటూ వార్నింగ్

Bigg Boss Ashu Reddy: తనపై వస్తున్న కథనాలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన బిగ్ బాస్ అషు రెడ్డి(Ashu reddy).

Actress Bigg Boss Ashu Reddy Responds on 9 Crore Love and Marriage Scam

  • తప్పుడు వార్తలపై అషు రెడ్డి హెచ్చరిక.
  • లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టీకరణ.
  • ఆరోపణలను ఖండించిన బిగ్‌బాస్ బ్యూటీ.

Ashu Reddy: బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డిపై నమోదైన రూ. 9.35 కోట్ల మోసం కేసు ఇప్పుడు టాలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తన కుమారుడిని నమ్మించి కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం కాజేసిందని ఓ బాధితుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అషు రెడ్డి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు.

*ఓటీటీలో లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. ‘రాకాస’ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తను ఎలాంటి తప్పు చేయలేదని, తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అషు రెడ్డి హెచ్చరించారు. “నా అనుమతి లేకుండా నా గురించి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసే ఏ ఛానెల్ లేదా మీడియా పైనైనా లీగల్ యాక్షన్ తీసుకుంటాను” అని ఆమె పేర్కొన్నారు. ఎదుటివారి వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని హితవు పలికిన అషు, ఈ వివాదాన్ని చట్టపరంగానే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగినట్లయింది.

మరోవైపు, బాధితులు మాత్రం అషు(Ashu reddy)పై గట్టి ఆధారాలతోనే పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 2018 నుంచి 2025 వరకు ఆమెకు చేరిన నగదు, ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. పోలీసులు ప్రస్తుతం ఆమె బ్యాంక్ లావాదేవీలను, ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అషు రెడ్డి ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Actress Ashu Reddy Responds on 9 Crore Love and Marriage Scam