Bhanupriya : మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ.. ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

తెలుగు తెరపై నటి గానే కాదు ఒక డాన్సర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్న నటి 'భానుప్రియ'. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న భానుప్రియ.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించింది.

Bhanupriya

Bhanupriya : తెలుగు తెరపై నటి గానే కాదు ఒక డాన్సర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్న నటి ‘భానుప్రియ’. తెలుగు అమ్మాయి అయిన భానుప్రియ చిన్నపాటి నుంచే కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ వచ్చింది. ఆ నాట్యమే సినిమాలో ఆమెకు అవకాశం వచ్చేలా చేసింది. తమిళ సినిమా ‘మెల్ల పేసుంగల్’ చిత్రంతో వెండితెరకు పరిచమైన భానుప్రియ.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 150 పైగా సినిమాల్లో నటించింది. అంతేకాదు దుబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పలువురు హీరోయిన్లకు గొంతు సాయం చేసింది.

Ashok Galla : ప్రశాంత్ వర్మ కథతో.. మహేష్ మేనల్లుడి సినిమా..

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న భానుప్రియ.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించింది. మీరు డాన్స్ స్కూల్ పెట్టాలి అనుకున్నారు కదా. ఎందుకు పెట్ట లేదు అని విలేకరి అడిగిన ప్రశ్నకి బదులిస్తూ.. అనుకున్నాను, కానీ ఆరోగ్య పరిస్థితి వల్ల ఆ ఆలోచన మానుకున్నాను. నా భర్త మరణం తరువాత నా జ్ఞాపక శక్తి తగ్గుతూ వచ్చింది. ప్రతిదీ మర్చిపోతున్నాను. ఆ క్రమంలోనే డాన్స్ లోని కొన్ని ముద్రలను మర్చిపోయాను అంటూ తెలియజేసింది.

అలాగే ఇటీవల ఒక సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్స్ చెబుతున్న సమయంలో ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయ్యిపోయి మొత్తం మర్చిపోయినట్లు కూడా చెప్పుకొచ్చింది. కాగా భానుప్రియ, ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ని 1998 లో వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరికి 2005 లో విడాకులు అయ్యింది అంటూ వార్తలు రావడమే కాదు విక్కీపీడియాలో ఇప్పటికి అలానే ఉంది. అయితే ఆ వార్తలో నిజం లేదని తెలియజేసింది. నటిస్తూ ఉండడం వల్ల వృత్తిపరంగా ఆయన ఒక చోట, నేను ఒక చోట ఉండవలసి వచ్చింది. అంతే తప్ప మేము విడిపోలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది భానుప్రియ.

ట్రెండింగ్ వార్తలు