Hema : కొత్త కారు కొన్న నటి హేమ.. వామ్మో ఈ కారు ధర ఎన్ని కోట్లు అంటే..?

తాజాగా మరోసారి హేమ ఓ ఖరీదైన కారు కొని వార్తలో నిలిచింది.(Hema)

  • Published on- July 16, 2026 / 09:21 AM IST

Hema

Hema : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి కొన్ని వందల సినిమాలతో మెప్పించింది హేమ. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే హేమ ఇటీవల ఓ డ్రగ్స్ కేసులో పేరు రావడం, తర్వాత క్లీన్ చిట్ తెచ్చుకోవడం, ఇంటర్వ్యూలలో సంచలన కామెంట్స్ చేయడం, తన తల్లి మరణించడం.. ఇలా వరుసగా పలు సంఘటనలతో వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా మరోసారి హేమ ఓ ఖరీదైన కారు కొని వార్తలో నిలిచింది.

హేమ తాజాగా ఓ కొత్త కారుని కొనుక్కొని హైదరాబాద్ లోని తాడ్బండ్ హనుమాన్ ఆలయం వద్ద పూజలు చేయించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో హేమ తన ఫ్యామిలీతో పాటు పూజలు నిర్వహించింది. అయితే హేమ కొన్న కారు ఖరీదు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Siddharth Galla Hyein Kim : కొరియన్ అమ్మాయితో మహేష్ మేనల్లుడు నిశ్చితార్థం, పసుపు వేడుక.. మరిన్ని ఫోటోలు చూశారా..?

హేమ ఖరీదైన కార్స్ బ్రాండ్ మెర్సిడెజ్ బెంజ్ లో GLS 450 అనే మోడల్ 7 సీటర్ లగ్జరీ SUV కార్ ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ కారు విలువ దాదాపు ఒక కోటి 32 లక్షల రూపాయలు. దీంతో కోటి రూపాయలకు పైగా పెట్టి ఖరీదైన కార్ కొనుక్కుందా హేమ అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం హేమ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మంచి పాత్రలు వస్తే చేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.