Himaja : షాప్ ఓపెనింగ్ లో సందడి చేసిన నటి హిమజ..

తాజాగా నటి హిమజ ఓ సెలూన్ ఓపెనింగ్ లో పాల్గొంది.

Actress Himaja Participated in Opening of Green Trends in Hyderabad

Himaja : సెలబ్రిటీలు ఓ పక్క నటిస్తూనే మరో పక్క షాప్ ఓపెనింగ్స్, యాడ్స్ చేస్తారని తెలిసిందే. తాజాగా నటి హిమజ ఓ సెలూన్ ఓపెనింగ్ లో పాల్గొంది. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది హిమజ. హైదరాబాద్ మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమంలో నటి హిమజ పాల్గొని షాప్ ఓపెనింగ్ చేసింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పాటు ఏపీ, తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు.

Also See : Ariyana Glory : హిమాచల్ ప్రదేశ్ లో వెకేషన్.. మంచులో ఎంజాయ్ చేస్తున్న అరియనా గ్లోరీ..

నటి హిమజ మాట్లాడుతూ.. గ్రీన్ ట్రెండ్స్ కు ఇండియా అంతటా బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడున్న సొసైటీలో అందంగా కనిపించేందుకు అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న కార్యక్రమం ఉన్నా హెయిర్ నుంచి ప్రతి విషయంలో అందంగా ముస్తాబై వెళ్తున్నారు. ఇక్కడ హెయిర్, స్టైల్, మేకోవర్ చేసుకున్నాక నన్ను నేనే నమ్మలేనంత అందంగా తయారయ్యాను అని తెలిపింది.

గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ మాట్లాడుతూ.. మా ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన హిమజ గారికి థ్యాంక్స్. ఆమెది మంచి హ్యాండ్. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చేవారికి కంప్లీట్ మేకోవర్ హై క్వాలిటీతో ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. గ్రీన్ ట్రెండ్స్ ని ఇక్కడ మణికొండ వాసులకు అందిస్తున్నాం. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చిన వాళ్ళు అందంగా ముస్తాభై, చాలా సంతోషంగా తిరిగి వెళ్తారు అని అన్నారు.

Also Read : Hit 3 Collections : నాని హిట్ 3 మూడు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా? బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తున్న న్యాచురల్ స్టార్..