Pooja Hegde : పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన బుట్ట‌బొమ్మ‌? వైర‌ల్ వార్త‌ల్లో నిజ‌మెంత‌?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు (Pooja Hegde) సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Actress pooja hegde green signal for marriage news viral

Pooja Hegde : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆమె పెళ్లికి సిద్ధమయ్యారనేది స‌ద‌రు వార్త‌ల సారాంశం. ప్రేమ వివాహం కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్‌కు పూజా ఒప్పుకుంద‌ట‌. కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కాగా.. వ‌రుడు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తినా? లేదంటే వ్యాపార రంగానికి చెందిన వ్య‌క్తినా? అన్న విష‌యం పై స్ప‌ష్ట‌త లేదు.

పూజా హెగ్డే పెళ్లి అంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త‌ల‌పై ఇప్పటివరకు.. హీరోయిన్ పూజా హెగ్డే లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ప్రచారం నిజమా? లేక కేవలం రూమర్లేనా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ధృవీకరణ మాత్రం లేదు.

Mirnalini Ravi : సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్‌.. ఏడేళ్ల స్నేహం.. ఫోటోలు వైర‌ల్..

ఇక కెరీర్ విషయానికి వస్తే.. 2014లో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఒక లైలా కోసం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత ముకుంద చిత్రంతో మెప్పించింది. అల్లు అర్జున్ హీరోగా డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం చిత్రం ఆమె కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింగ్‌గా నిలిచింది. ఆ త‌రువాత ఆమె స్టార్ హీరోల చిత్రాల‌తో న‌టిస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అలాగే త‌మిళం, బాలీవుడ్‌లోనూ ఆమె ప‌లు చిత్రాల్లో న‌టించింది. 35 ఏళ్ల ఈ బ్యూటీ ప్ర‌స్తుతం ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో తెరకెక్కుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రంలో, రాఘవ లారెన్స్ సరసన ‘కాంచన-4’ న‌టిస్తోంది.