Mirnalini Ravi : సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఏడేళ్ల స్నేహం.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ మృణాళిని రవి (Mirnalini Ravi) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.
Actress Mirnalini Ravi engaged her boy friend photos viral
Mirnalini Ravi : హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. మలేసియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో ఆమె జీవితాన్ని పంచుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు తెలిపారు. కాబోయే భర్తతో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు మృణాళిని రవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా.. మృణాళిని రవి, మహావిష్ణు గత ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నట్లు సమాచారం. ఆ స్నేహమే ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోంది. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు.

కెరీర్ విషయానికి వస్తే.. మృణాళిని రవి 2019లో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది. ఆతరువాత ‘ఛాంపియన్’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’, ‘కోబ్రా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ ఆమె సుపరిచితమే. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
View this post on Instagram
