Pragathi Dance
Pragathi Dance: ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అన్నట్లు 44 ఏళ్ల వయసులోనూ అమ్మాయిలకు గట్టిపోటి ఇస్తున్నట్లుంటుంది పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఫిజిక్. ఇప్పటిరకు ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే.
Pragathi : క్యాట్‌వాక్‌తో కవ్విస్తున్న ప్రగతి
ఇన్‌స్టాగ్రామ్ ప్రగతి పోస్ట్ చేసే వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. షూటింగ్ స్పాట్ పిక్స్‌తో పాటు, ఆమె షేర్ చేసే జిమ్ వీడియోలు చూస్తే షాకవ్వాల్సిందే. ఇటీవల ఆమె వేసిన తీన్‌మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు మరో వీడియోతో సోషల్ మీడియాలో రచ్చ లేపిందామె.
Pragathi Dance : వయసుతో పనిలేదు.. ఊపొస్తే ఊపాల్సిందే..
ఇటీవల జరిగిన సంతోషం సుమన్ టీవీ అవార్డ్స్ ఫంక్షన్‌లో ‘ఆట’ సందీప్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది ప్రగతి. మెగాస్టార్ చిరంజీవి ‘అల్లుడా మజాకా’ లోని బ్లాక్‌బస్టర్ ‘అత్తో అత్తమ్మ కూతురో’ సాంగ్‌కి ప్రగతి స్పెప్పులేసింది. ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్‌తో రచ్చ రచ్చ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.