Priyamani : ప్రిన్సెస్ ప్రియమణి.. పిక్స్ వైరల్..

కోటలో యువరాణిలా హొయలొలికిస్తూ ఆకట్టుకుంది ప్రియమణి..

Priyamani

Priyamani: తెలుగులో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తరుణ్ వంటి యంగ్ స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన ప్రియమణి.. మ్యారేజ్ తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. రియాలిటీ షోకు జడ్జిగా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. బాలయ్యతో ‘మిత్రుడు’, నాగార్జునతో ‘రగడ’ సినిమాల్లో ఆడిపాడిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇటీవల మరో సీనియర్ హీరో వెంకటేష్‌కి జోడీగా ‘నారప్ప’లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Priyamani Husband : ప్రియమణితో నా భర్త పెళ్లి అక్రమం.. మొదటి భార్య అయేషా ఆరోపణలు..

ఇక ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ అయితే అమ్మడికి పిచ్చ క్రేజ్ తీసుకొచ్చింది. ఇద్దరు పిల్లల తల్లిగా నటించినా.. తన పరువాల పదును తగ్గలేదన్నంత గ్లామర్‌గా కనిపించింది ప్రియమణి. అప్పడప్పుడు ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో సందడి చేసే ప్రియమణి రీసెంట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Priyamani : తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించిన ప్రియమణి..

ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్న ‘ఢీ’ షోలో ఈ వారం కొన్ని సినిమాల్లోని సీన్లను పేరడీ చెయ్యబోతున్నారు. అందులో భాగంగా అమ్మడు మిత్రవిందగా కనిపించనుంది. అప్పుడు చేసిన ఫొటో షూట్‌కి సంబంధించిన పిక్స్ అదిరిపోయాయి.

Priyamani : నెటిజన్ న్యూడ్ ఫొటో అడిగాడు.. అతని ఇంట్లో ఆడవాళ్లతో కంపేర్ చేస్తూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది..

కోటలో యువరాణిలా హొయలొలికిస్తూ ఆకట్టుకుంది ప్రియమణి. ప్రస్తుతం ‘సైనైడ్’ అనే పాన్ ఇండియా మూవీతో పాటు.. రానా – సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘విరాటపర్వం’ లో కీలక పాత్రలో నటిస్తోంది ప్రియమణి.